Home / Tag Archives: lockdown (page 3)

Tag Archives: lockdown

తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా..?

తెలంగాణలో లాక్డౌన్ను కొనసాగించాలా? లేదా? అనే అంశంపై 20న కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ‘ఆస్క్ మంత్రి కేటీఆర్’ లో మంత్రి KTR ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే పూర్తి లాక్డౌన్ విధించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పారు. 4 గంటలకు మించి సడలింపులు ఇచ్చే అవకాశం లేదన్నారు. అటు త్వరలోనే తానూ ప్లాస్మా దానం చేస్తానన్నారు. కరోనా వస్తే మానసికంగా దృఢంగా ఉండాలని, సొంత వైద్యం వద్దని, వ్యాయామం చేయాలని చెప్పారు.

Read More »

సీఎం కేసీఆర్ పై షర్మిల అగ్రహం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం KCRపై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లాక్డౌన్ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు వైఎస్ షర్మిల.. ‘అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. ఆయుష్మాన్ భారత్లో చేరరు’ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం ‘KCR సారు .. సోయిలకురా. ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చు’ అంటూ వైఎస్ …

Read More »

తెలంగాణలో వ్యవసాయ రంగానికి లాక్డౌన్ మినహాయింపు

తెలంగాణలో నేటి నుండి 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుండగా.. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లులకు లాక్ డౌన్ వర్తించదు. FCIకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, విత్తనాల షాపులు, సంబంధిత రవాణా, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం యథావిథిగా కొనసాగించనుంది.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు వీటికే…

తెలంగాణలో రేపటి నుండి లాక్డౌన్ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అయితే    లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు : – వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. – …

Read More »

తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు

ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలు : – మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి …

Read More »

దేశంలో లాక్డౌన్ పెట్టండి

కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధించగా.. కొన్నిచోట్ల కరోనా బాధితులకు సరైన చికిత్స అందడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ‘దేశంలో లాక్డౌన్ పెట్టాలి. కరోనా నియంత్రణలో అలసత్వం ఎందుకు? కరోనా చైన్ నియంత్రించాలంటే లాక్డౌన్ తప్పనిసరి. లాక్ డౌన్ పెట్టడం వల్ల మౌలిక వైద్య సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు’ అని IMA లేఖలో పేర్కొంది.

Read More »

తమిళనాడులో లాక్డౌన్

ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ …

Read More »

కరోనా కట్టడీకి అదోక్కటే మార్గం

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటిన, 60 శాతం బెడ్లు నిండిన ప్రాంతాల్లో కఠిన లాక్డ్ డౌన్ విధించాలని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాక్షిక లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు కరోనా చైన్ని తెంచలేవన్నారు. ప్రాంతీయ లాక్డౌనే ఏకైక మార్గమన్న ఆయన.. ఇదే అంశం కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఉన్నా అమలు పరచడం లేదన్నారు.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై క్లారిటీ

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat