సాధారణంగానే కాకరకాయ తినడం చాలా మంచిది. అయితే వర్షాకాలంలో తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీన్ని కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తాగినా పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. వానాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనివ్వవు.
Read More »దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు తెలుసా..?
దేశంలో అందరికంటే ముందు నిద్రలేసే గ్రామం పేరు దోంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దేశంలో తొలి సూర్యకిరణాలు తాకే చోటును, ఆ ఉదయాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వెళ్తుంటారు. అక్కడి బస్సులు ఉండవు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి.. ఆ తొలి సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు టూరిస్టులు. దోంగ్ గ్రామంలో తొలి కిరణాలు, నారింజ రంగుతో పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి. అక్కడ సాయంత్రం 4కే సూర్యాస్తమయం అవుతుంది.
Read More »ఆషాఢ మాసంలో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?
ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగ్గా పనిచేయవు, వర్షాలు కురవడంతో పొలం పనులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఆషాఢంలో గర్భధారణకు అనువైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు. అలాగే, ఆషాఢంలో పూజలు, వ్రతాలు వంటివి ఎక్కువగా ఉంటాయి. పూజలతో పూజారులంతా బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. ఈ కారణాలతో ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు.
Read More »బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలు
బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలున్నా యంటు న్నారు నిపుణులు.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? బీపీని నియంత్రిస్తుంది. నీరసం తగ్గిస్తుంది రక్తహీనతకు చెక్ పెడుతుంది గుండె జబ్బులను అరికడుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది
Read More »కొండ ఎక్కిన కోడి గుడ్డు ధర
ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రోజురోజుకూ కొండెక్కుతున్నది. ఈ నెల మొదటివారంలో రైతువద్ద గుడ్డు లిప్టింగ్ ధర రూ.3.67 ఉంటే.. ప్రస్తుతం రూ.5.18గా ఉన్నది. హోల్సేల్ వ్యాపారులకు రూ.6 పడుతుండగా.. వినియోగదారులకు చేరే సరికి రూ.6.50 నుంచి రూ.7 అవుతున్నది. నెల రోజుల్లోనే గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read More »మెంతి ఆకు తింటే ఉంటది
మెంతి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం * గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. * శరీరంలో కొవ్వు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి * అధిక బరువు తగ్గుతారు *లివర్ సమస్యలను నివారిస్తుంది. * మలబద్ధకం తగ్గుతుంది * చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది * డయాబెటిస్ అదుపులో ఉంటుంది. * జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
Read More »కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలు
కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలున్నాయి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… 1.విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. 4. క్యాన్సర్ బారిన పడకుండా కణాలను తగ్గిస్తుంది. 5. విటమిన్ ఎ వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 6. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. 7. బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. 8. గర్భిణులకు ఎంతో మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
Read More »హాయిగా నిద్రపోవాలంటే
హాయిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగండి రాత్రిపూట టీ, కాఫీ, ఆల్కహాల్ తీసుకోకండి రాత్రి భోజనం మితంగా తినండి త్వరగా జీర్ణంకాని పదార్థాలు తీసుకోకండి రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రపోండి బెడ్రూంలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోండి నిద్రకు ముందు ఫోన్ అస్సలు వాడకండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి రోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి
Read More »చేపలు తినడం వల్ల అనేక లాభాలు
చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..చేపలు తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మెదడు బాగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. 2. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. 3. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. 4. విటమిన్ డి లభిస్తుంది. 5. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే …
Read More »ఇలా చేస్తే రూ.300 తక్కువకు గ్యాస్ సిలిండర్
గత కొన్ని నెలలుగా గ్యాస్ ధర రూ.200 పెరగడంతో సామాన్యులపై గుదిబండలాగా మారింది అయితే, సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ రూ.300 తక్కువకు లభిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ పై కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీని రూ.174 నుంచి రూ.312 రూపాయలకు పెంచింది. స్కీం కింద రిజిస్టరైతే సబ్సిడీ లభిస్తుంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే ఈ …
Read More »