రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంటలను వేయాలని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో …
Read More »తెలంగాణలో 24గంటల కరెంటు
తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు అంటే …
Read More »సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం
గోవా రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమోద్ సావంత్ ఈ రోజు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం ఖట్టర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తదితరులు హాజరయ్యారు. గోవా రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ప్రమోద్ సావంత్ కు ఇది రెండోసారి కావడం గమనార్హం . గతంలో అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ …
Read More »అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భారతదేశం మొత్తంలో పశ్చిమబెంగాల్, ఏపీకి మినహాయించి అన్ని రాష్ర్టాలు జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా తెలంగాణ కూడా జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిపాలన సౌలభ్యం – ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు …
Read More »సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారింది..కేసీఆర్
శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …
Read More »ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు..కేసీఆర్
ఇవాళ ( శుక్రవారం ) శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు . లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీ నిధులు …
Read More »బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బీసీలే అని అన్నారు . 50 శాతానికి పైబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత వేరొకటి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కడు …
Read More »నిండు సభలో సంపత్ పరువు తీసిన కడియం
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా సంపత్ కుమార్ ఆ విషయంపై మాట్లాడకుండా.. సంబంధం లేని విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. 2016-17 ఏడాదికి గానూ వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ఫస్ట్ క్వార్టర్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని లోక్ సభలో కేంద్ర మంత్రి రావు …
Read More »ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి హరీష్ ఫైర్
తెలంగాణ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలుపడాన్ని మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. సభలో ఏదైన ఒక విషయం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ లీడర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ నిరసన వ్యక్తం చేస్తారు. వీరిద్దరూ లేనప్పుడు ఉపనాయకుడు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటదని తెలిపారు. కాంగ్రెస్ ఉపనాయకుడు …
Read More »విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు..మంత్రి ఈటల
ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా.. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు . 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్ కాలేదని చెప్పారు.ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని మంత్రి …
Read More »