ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఐసీయూలో తమ పర్యవేక్షణలోనే ఆమెకు చికిత్సను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందని వైద్యులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థించాలని వైద్యులు కోరారు. కాగా కరోనాతో పాటు న్యుమోనియాతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ చేరారు.
Read More »లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని ఆమె సోదరి ఉషా మంగేష్కర్ తెలిపారు. ఆమెకు స్వల్పంగా న్యూమోనియా లక్షణాలు ఉండగా తగ్గిపోయాయని, కరోనా ఆమెపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం లత కోలుకుంటున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఉషా తెలిపారు. కాగా, కొవిడ్ నిర్ధారణ కావడంతో లతా మంగేష్కర్ని ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో …
Read More »వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్
శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …
Read More »లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం
శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న కాస్త ఆరోగ్యం కుదుటపడిన కానీ మరో రెండు రోజులు గడవంది ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి. లతా మంగేష్కర్ తెలుగు తో సహా తమిళం, కన్నడం …
Read More »లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్
ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ (90)హెల్త్ కండీషన్ ఇంకా విషమంగానే ఉన్నాట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అయితే అంతకు ముందు ఈ సమస్యతోనే ఆమెను ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో నిన్న సోమవారం తెల్లరుజామున చేర్చారు.
Read More »