నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సుబ్రమణ్యం గతేడాది సెప్టెంబరులో కామర్స్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. కాగా, పరమేశ్వరన్.. త్వరలో ప్రపంచ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read More »అలా చేస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లే వస్తాయి
దేశంలో 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేస్తే లో బీజేపీని 100 కంటే తక్కువ సీట్లకే పరిమితం చేయొచ్చన్నారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. కాంగ్రెస్ దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారంలోని బీజేపీని గద్దె దించాలని.. ఇందుకోసం ప్రతిపక్షాలను ఏకం చేయడమే తన లక్ష్యమని అన్నారు. బిహార్ లోని పూర్నియాలో …
Read More »రాజకీయాల నుండి సోనియా గాంధీ తప్పుకోవడం లేదా..?
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత.. ఏఐసీసీ చీఫ్ శ్రీమతి సోనియా గాంధీ రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోనియా గాంధీ దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. అయితే సోనియాగాంధీ అలా అనలేదని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుమారి సెల్జా తెలిపారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే సంతోషంగా …
Read More »వచ్చేన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం
దేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమ కూటమి ప్రయత్నిస్తుందని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాక తొలిసారి మహాగర్ బంధన్ ర్యాలీని ఉద్దేశించి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు.
Read More »బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇండ్లపై సీబీఐ దాడులు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి నమోదైన కేసులో లాలూ, రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నది. పట్నా, గోపాల్‌గంజ్, ఢిల్లీతోపాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను భూములు, ఇండ్లు …
Read More »మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష
గతంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో ఆర్‌జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.60లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణం కేసులో ఈ నెల 15న లాలూను న్యాయస్థానం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు …
Read More »సీఎం కేసీఆర్ తో తేజస్వీ యాదవ్ భేటీ అందుకేనా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీ పాలసీ, విద్యుత్ సవరణ చట్టం, రైతు వ్యతిరేక విధానాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చించిన విషయం తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ …
Read More »సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని కేసీఆర్.. లాలూతో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని లాలూ కోరినట్లు సమాచారం. కేసీఆర్ పాలనా అనుభవం దేశానికి అవసరముందని లాలూ అన్నట్లు తెలిసింది.
Read More »Big Breaking News-లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో లాలూకు ప్రస్తుతం …
Read More »లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుతో ఐశ్వర్యరాయ్ వివాహం..!!
ఆర్జేడీ అధినేత, రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్య రాయ్ వివాహమేమిటి..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..అవును మీరు చదివింది నిజమే..కాని మీరు అనుకుంటునట్లు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కాదు.. బీహార్ మాజీ సీ ఎం దరోగా ప్రసాద్‌రాయ్ మనుమరాలుతో. ఆమె పేరు కూడా ఐశ్వర్య రాయే .ఆమె తండ్రి సీనియర్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్…మరీ చంద్రికా రాయ్..లాలూ కు …
Read More »