తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారానికి ఎల్.రమణ పార్టీలో చేరారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. తెరాసలో చేరిన ఎల్. రమణకు కేసీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. తెరాసలో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణతో తీరిందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. తెరాస పథకాలు ప్రతి …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణ
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎల్ రమణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Read More »టీడీపీకి ఎల్ రమణ రాజీనామా
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ర్ట ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని రమణ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన …
Read More »కారు ఎక్కనున్న ఎల్ రమణ
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు మరో ప్రచారం. ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు సమాచారం …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »నాగార్జున సాగర్ ఉప ఎన్నిక-టీడీపీ అభ్యర్థి ఖరారు…
తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది మువ్వా అరుణ్‌కుమార్ పోటీచేస్తారని టీడీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ శనివారం తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడే టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. …
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ
తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు ఎల్. రమణను కొనసాగిస్తూ చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రమణను తొలగించి, మరొకరిని అవకాశం ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబును డిమాండ్ చేశారు. దీంతో టీటీడీపీలో కాస్త అలజడి రేగింది. కానీ… ఎల్. రమణ బలమైన బీసీ నేత కావడం…. తెలంగాణలో పార్టీ కష్టకాలంలో …
Read More »బీజేపీలోకి టీటీడీపీ నేత వీరేందర్ గౌడ్
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ,మాజీ హోం మంత్రి ,మాజీ ఎంపీ టి. దేవేందర్ గౌడ్ తనయుడు అయిన వీరేందర్ గౌడ్ ఈ రోజు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని నగర పరిధిలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయిన వీరేందర్ గౌడ్ ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు …
Read More »టీడీపీలో కలకలం.కూటమికి గుడ్‌బై..!
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏర్పాటుచేసుకున్న మహాకూటమి చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాకపోవడంతో…ఆ పార్టీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ తమకు అవమానాన్నే మిగిల్చిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More »టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈక్రమంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,కాంగ్రెస్,తెలంగాణ జనసమితి,సీపీఐలాంటి పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహకూటమి ఏర్పాటు చేయడంలో ఎల్ రమణ కీలక పాత్ర పోషించారు. ఈసందర్బంగా సీట్లపంపకం సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టి.జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదేస్థానం నుండి …
Read More »