కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా నియోజకవర్గ క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని అన్నారు. దేశంలోనే అన్ని మతాలు, కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ సమానంగా గౌరవించే ఏకైక ముఖ్యమంత్రి …
Read More »“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం రాజీవ్ గాంధీనగర్ బుద్ధ విహార్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా బౌద్ధ మతస్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గౌరవ …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘ ఘనంగా జరిగింది. కొంపల్లి, దూలపల్లి, బహదూర్ పల్లి, సూరారం, నిజాంపేట్, చింతల్ భగత్ సింగ్ నగర్ లలో ఏర్పాటు చేసిన విద్యా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో …
Read More »సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గార్డెన్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి …
Read More »కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ కు ఐడి కార్డులు పంపిణీ
కుత్బుల్లాపూర్ కన్స్ట్రక్షన్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ యాదయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వర్, జనరల్ సెక్రెటరీ రాజేంద్ర ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read More »” తెలంగాణ మంచినీళ్ళ పండుగ “లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ” తెలంగాణ మంచినీళ్ళ పండుగ ” వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటగా గాజులరామారం దేవేందర్ నగర్ మంచినీటి రిజర్వాయర్ నుండి ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం షాపూర్ నగర్ పోచమ్మ ఆలయంలో మహిళలు బోనాలతో ప్రత్యేక పూజలు చేసి ఎంజే గార్డెన్స్ …
Read More »ఎస్టీపీలతో 100% మురుగునీటి శుద్ధీకరణ…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు ‘తెలంగాణ మంచినీళ్ళ పండుగ‘ను నిర్వహిస్తున్న నేపథ్యంలో చెరువులు కలుషితం కాకుండా వంద శాతం మురుగునీటిని శుద్దీకరించాలనే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.248 కోట్లతో చేపడుతున్న 5 ఎస్టీపీల నిర్మాణ పనుల్లో భాగంగా జీడిమెట్ల వెన్నెల గడ్డ వద్ద రూ.21.87 కోట్లతో 10 MLD సామర్ధ్యం గల ఎస్టీపీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అధికారులతో కలిసి పరిశీలించారు. …
Read More »కుత్బుల్లాపూర్ లో అట్టహాసంగా “తెలంగాణ రన్”…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో “తెలంగాణ రన్” అట్టహాసంగా జరిగింది. ఈ రన్ కు ముఖ్య అతిథులుగా హాజరైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గారు, అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఐఎఎస్ గారు, జోనల్ కమిషనర్ మమత గారు, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదు…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బహదూర్ పల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన “తెలంగాణ సంక్షేమ సంబురాలు”లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తమకు జరిగిన మేలును వివరిస్తూ సీఎం కేసీఆర్ …
Read More »