ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్‌ఎస్ చేపట్టిన దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ భవన్ పరిసరాలు మొత్తం గులాబీ మయం అయ్యాయి. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతల కటౌట్లు, బ్యానర్లు వెలిసాయి. ప్రజా ప్రతినిథులతోపాటు అభిమానులు ఢిల్లీకి భారీ సంఖ్యలో చేరుకున్నారు. రైతన్న కోసం పోరాడుతున్న కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నెత్తిన వడ్ల బస్తా.. ఒంటి నిండా గులాబీ రంగు పూసుని వచ్చిన …
Read More »పోడు భూములపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..
తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరిరక్షణ, హరితహారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరితహారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు మూడు రోజుల పాటు …
Read More »ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేపట్టాం
హైదరాబాద్‌లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్పటికే రూ . 19వందల 46కోట్ల 90లక్షలతో 22 పనులు పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీ కింద రూ. 5,693 కోట్ల 51 లక్షల వ్యయంతో 24 పనులు …
Read More »తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశం లేదా..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్‌కు అవకాశం లేదని.. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 27 వేల పడకలు ఉన్నాయని, మరో ఏడు వేల పడకలు నెలాఖరుకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో చేపట్టిన 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్ సర్కిల్‌లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్‌లో సోమవారం టీకా పంపిణీ …
Read More »పరిశ్రమల శాఖ పైన మంత్రి కేటీఆర్ సమీక్ష
పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు టి ఎస్ ఐఐసి కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జరిపిన కేటీఆర్, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పనిచేయాలని …
Read More »బాధపడోద్దు.. అండగా ఉంటా-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిన్న గురువారం రోజున ముంపుకు గురైన నిర్మల్ పట్టణంలోని GNR కాలనీలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. కాలనీలోని బాధితులతో మాట్లాడి ముంపు సమయంలో బాధితులు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధితులు ఎవరు అధైర్య పడవద్దని వారికి అండగా ఉంటామన్నారు. అధికారుల ద్వారా నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. ప్రకృతి విలయం …
Read More »గొల్ల, కురుమలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణలో గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి …
Read More »అందరికి ఆదర్శంగా నిలిచిన మంత్రి కేటీఆర్ నిర్ణయం
పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతేడాది తన పుట్టినరోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి వ్యక్తిగతంగా ఆరు అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన ఆయన.. ఈ ఏడాది వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్‌సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా …
Read More »ఈ నెల 26న దళితబంధు పై సీఎం కేసీఆర్ సమావేశం
దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించనున్న దళితబంధు పథకంపై తొలి అవగాహన సదస్సు ఈ నెల 26న ప్రగతిభవన్‌లో జరుగనున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు …
Read More »