తెలంగాణలో ఇకపై రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లకుండానే ఆర్ట్స్ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది. ఆయా అభ్యర్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఆ తరువాత పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలు రాయొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఇలాంటి విద్యార్థులు ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా …
Read More »నేడే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగురనున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరవనున్నది. భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నది.జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీ వసంత్‌విహార్‌లో నిర్మించిన ‘తెలంగాణ భవన్’ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఢిల్లీలో చెరిగిపోని మన దస్కత్. ఇది తెలంగాణ దఫ్తర్. సంకల్పబలం సమృద్ధిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది తలపెట్టినా విజయం …
Read More »సీఎం కేసీఆర్ గార్ని కల్సిన మేయర్ గుండు సుధారాణి
కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పారిశుద్ధ్య కార్మికులకు వేతనంలో అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేస్తూ కార్మికుల పక్షాన, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తరఫున మంగళవారం రోజున నూతన సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు …
Read More »తెలంగాణలో మరో వినూత్న పథకం
తెలంగాణ రాష్ట్రంలో ‘రైతుబీమా’ తరహాలో ‘గీతకార్మికుల బీమా’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీతకార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ఆయన మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల బీమా పథకంపై చర్చించారు.ఈ సందర్భంగా …
Read More »సీఎం కేసీఆర్ పై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ అధికార వైసీపీకి చెందిన శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ కేవలం రెండు అంటే రెండేండ్ల సమయంలోనే రూ.650 కోట్లతో అద్భుతంగా సెక్రటేరియట్ కట్టి చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ హీరో అని ఆయన ప్రశంసించారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, సుపరిపాలన కోసం అతి తక్కువ సమయంలో అత్యాధునిక …
Read More »ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మే డే శుభాకాంక్షలు
1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శన మూలంగా ఆవిర్భవించిన మే డే శుభాకాంక్షలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కార్మికులకు తెలిపారు. కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి పట్నంలో తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు
కార్మికుల దినోత్సవం.. మే’ డే సందర్భంగా కార్మిక, కర్షక, కూలీలు, వృత్తి పనిచేసేవారు, మొత్తంగా తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి వొక కష్టజీవికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తర తరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని సిఎం కేసీఆర్ తెలిపారు. కార్మిక కర్షక …
Read More »ఏప్రిల్ 30న మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు నూతన సచివాలయానికి చేరుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో కేసీఆర్ ఆశీనులు కానున్నారు.అనంతరం పలు దస్త్రాలపై కేసీఆర్ సంతకాలు చేసి పరిపాలనను ప్రారంభించనున్నారు.రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో …
Read More »మౌనిక కుటుంబాన్ని ఆదుకుంటాం -మేయర్ విజయలక్ష్మీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్లో పడి చిన్నారి మౌనిక మరణించిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి స్పందించారు. పెద్ద వర్షం వల్ల అక్కడ రోడ్డు కుంగిపోయి ఆ గోతిలో పడి మౌనిక మృతి చెందినట్లు చెప్పారు. కుంగిన చోట ఉంచిన బారికేడ్లను కొందరు తొలగించడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. నాలాలో పడి ఆమె చనిపోలేదన్నారు. మౌనిక కుటుంబాన్ని …
Read More »పార్టీ మార్పుపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ
తెలంగాణ బీజేపీ బహిష్కృత నేత .. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. గత కొన్ని రోజులుగా తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ‘నేను టీడీపీలోకి వెళ్లడం లేదు. టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీడీపీ నేతలతో చర్చలు జరపలేదు. బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు. కాగా రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారని జోరుగా …
Read More »