కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15న ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శ్రీసీతారాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు ఖమ్మంలో జరిగే బహిరంగసభలోపాల్గొంటారు. సభ అనంతరం పార్టీకి చెందిన పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Read More »దేవరకొండ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు
తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రచార రథంపై భట్టి సమక్షంలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతున్నాడు.. ఈ సమయంలో మరో నేత కిషన్ నాయక్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో బాలూనాయక్ వారిని వారిస్తుండగా.. కిషన్ నాయక్ ఆయనతో గొడవకు దిగారు. భట్టి ఎంత చెప్పినా ఇద్దరూ వినలేదు. దీంతో ఆయన మైక్ తీసుకుని …
Read More »హెల్త్ హబ్‌గా తెలంగాణ
తెలంగాణ హెల్త్ హబ్‌గా అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. హైదరాబాద్ నలుమూలలా 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో …
Read More »ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన నేత.. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోవడంతో కాసేపటి క్రితం కన్నుమూశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న జగదీష్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కేసీఆర్.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. …
Read More »తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి
ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …
Read More »టీబీజేపీ అధ్యక్షుడిగా సరికొత్త పేరు..?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా డీకే అరుణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి,మాజీ మంత్రి .. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవితోపాటు కీలక అధికారాలు అప్పగించాలన్న ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నాయట. …
Read More »సింగరేణి కార్మికులకు దసరా కానుక
2014లో సింగరేణి టర్నోవర్ రూ.11,000 కోట్లు ఉంటే ఇప్పుడది రూ.33,000 కోట్లకు చేరుకుందని గులాబీ దళపతి.. సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో అన్నారు. అదే విధంగా లాభాలు రూ.300-400 కోట్లు మాత్రమే ఉంటే.. ఈ ఏడాది రూ.2,184 కోట్లకు పైగా లాభాలు వచ్చాయన్నారు. ఈ లాభాల వల్ల వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ.700 కోట్లుగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Read More »సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
తెలంగాణ రాష్ట్ర 9 ఏండ్ల సంక్షేమ సుఖ తెలంగాణ 10 ఏండ్లలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సుపరిపాలన దినోత్సవ వేడుకలు ఈరోజు బోథ్ నియోజకవర్గంలోని నూతన మండలమైన భీంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు …
Read More »సాంబాచారిని పరామర్శించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్, సూర్యాపేట రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాంబా చారిని శనివారం కాసరబాద్ గ్రామంలోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట జడ్పిటిసి జీడి బిక్షం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సంకరమద్ది రమణారెడ్డి, నాయకులు కొల్లు నరేష్, బంటు సైదులు, నాగరాజు, …
Read More »ప్రతి గడపకి సంక్షేమ పథకాల ఫలాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగు పెట్టిన శుభ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం లోని పాటీ గ్రామ పరిధిలో గల SVR గార్డెన్స్ లో సంక్షేమ సంబురాలు నిర్వహించడం …
Read More »