తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదివారం సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” ఆయన త్వరగా కోలుకోవాలి.. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించాలి అని కోరుకుంటున్నాను. కొత్త ప్రభుత్వానికి కేసీఆర్ సలహాలు.. సూచనలు కావాలని …
Read More »ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజీనామా..?
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్, దుడ్యాల రహదారుల విస్తరణ దస్త్రంపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఎంపీగా రాజీనామా చేస్తానని వెల్లడించారు. రేపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్ర రహదారులపై చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని 14 రోడ్లకు …
Read More »యశోద ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి సర్జరీతో సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి .. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మంత్రులతో కల్సి ఆసుపత్రికెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులు.. అందుతున్న వైద్యసేవలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా …
Read More »తెలంగాణలో మరో ఆరు మంత్రి పదవులు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మిగతా ఆరుగురు మంత్రులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఆరు మంత్రి పదవులబు దాదాపు పదిహేను మంది పోటి పడుతున్నారు. వీరిలో షబ్బీర్ ఆలీ, ఫిరోజ్ ఖాన్,వివేక్,వినోద్,మల్ రెడ్డి రంగారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హన్మంతరావు,మధుయాష్కీ గౌడ్,అద్దంకి దయాకర్,బాలు నాయక్ …
Read More »దివ్యాంగురాలు రజినీకి జీతం ఎంతో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అగ్రికల్చర్ & కోఆపరేషన్ డిపార్ట్మెంటులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఆమె విధులు నిర్వర్తించనున్నారు. ఆమె నెలకు రూ.50,000లు జీతం అందుకోనున్నారు.
Read More »ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుతో రోజుకు సగటున రూ.4కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి సగటున రోజుకు రూ.14కోట్ల రాబడి వస్తోంది.. ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు. …
Read More »ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారట. ఒకవేళ అందుకు ఒవైసీ అంగీకరిస్తే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా డిసెంబరు 9న అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీనిపై …
Read More »తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 2008 (ఉపఎన్నిక), 2009 ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిన ఆయన 2022లో టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా …
Read More »ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ -వేలాదిగా తరలివచ్చిన జనం
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ మొదలైంది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో పలు శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజాదర్భార్ కొనసాగుతుంది. ఈ ప్రజా దర్భార్ కు రాష్ట్ర నలుమూలాల నుండి వేలాది ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో తమకు …
Read More »ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు …
Read More »