తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ గారి భౌతికకాయాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమం లో K R అమోస్ గారి పాత్ర ఎంతో ఉందన్నారు. K R అమోస్ గారు ప్రత్యేక …
Read More »హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై శివాజినగర్ కు చెందిన యూత్ సుమారు 100 మంది అమరారపు వెంకన్న ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ మేరకు వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా …
Read More »ఓఆర్ఆర్ చుట్టూ మరో 18 లాజిస్టిక్ పార్కులు
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ లో పలు ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన్ చెరువు,మంత్రాల చెరువు,పెద్ద చెరువులోకి వచ్చే మురుగునీరు రాకుండా మొత్తం ఇరవై మూడు కోట్లతో హెచ్ఎండీఏ చేపట్టనున్న ట్రంక్ లైన్ పనులకు మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి సబితా …
Read More »తెలంగాణలో చిన్నారుల్లో ఐరన్ లోపం తక్కువ
తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశ సగటు కంటే తక్కువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల సగటు చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణేర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి విధితమే. అందులో భాగంగా కేసీఆర్ కిట్లు,సర్కారు దవఖానాల్లో కార్పోరేట్ తరహా వైద్య వసతులు కల్పన తదితర కారణాలతో రాష్ట్రంలో …
Read More »తెలంగాణ పల్లె ప్రగతికి నిధులు
తెలంగాణలోని అన్ని పల్లెలు,గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం పల్లె ప్రగతి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముప్పై రోజుల ప్రణాళికను ఎంతో విజయవంతంగా గ్రామ సర్పంచులు,వార్డుమెంబర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి రూ.64కోట్లను విడుదల చేసింది. రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా మిగతా ముప్పై రెండు జిల్లాలకు రెండు కోట్లు చొప్పున …
Read More »ఆర్టీసీలో ఉద్యోగాలకు అర్హతలివే
తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలు రూపొందించింది. దీనిలో భాగంగా కండక్టర్ పోస్టులకు పదో తరగతి అర్హతగా కమిటీ ప్రతిపాదించింది. ఇక డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా పద్దెనిమిది నెలలు పాటు భారీ వాహానం నడిపిన అనుభవం ఉండాలని కమిటీ సూచనలు తెలిపింది. అయితే డ్రైవర్ పోస్టులకు కనీస వయస్సు 22ఏళ్ళు. కండక్టర్ పోస్టులకు …
Read More »ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తాజా ప్రకటన
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సమ్మెపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి ముగిసింది. చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సమయంలో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది …
Read More »ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ …
Read More »సగం బస్సులు అద్దె బస్సులే
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సగం బస్సులు అద్దె బస్సులే అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనను ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా మీడియాకు విడుదల చేశారు. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ”తెలంగాణ ఆర్టీసీలో భవిష్యత్ లో నడుపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయి. మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివి ఉండాలని నిర్ణయం జరిగింది. ఈ …
Read More »ప్రజలే నాకు ముఖ్యం -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై స్పందిస్తూ”తనకు అన్నింటికన్నా అత్యంత ప్రాధాన్య అంశం తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమేనని తేల్చి చెప్పారు. సమ్మెపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెపై స్పందిస్తూ” యావన్మంది ప్రజల క్షేమమే నా ధ్యేయం. …
Read More »