తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు మహాత్మ జ్యోతి బా-పూలే గురుకులం పాఠశాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సరైన సదుపాయాలు ఎల్లప్పుడూ అందించాలని అన్నారు. విద్యార్థులను రోజు వారి పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు మరియు విద్యార్థుల సామగ్రి పెట్టను తనిఖీ చేసి విద్యార్థులకు నెల నెల రావాల్సిన …
Read More »టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” దేశంలోనే గొప్ప రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ పొదుపు అవార్డులను అందుకున్న వారికి ప్రత్యేక …
Read More »సీఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేద్దాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మానస పుత్రిక గురుకుల విద్యను ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. మంగళవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన …
Read More »వడ్డీలేని రుణాలు అందరికీ ఇవ్వాలి-మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సంగతి విదితమే. ఈ సమావేశంలో జీఎస్టీ బకాయిలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయకు కేటాయించాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన సంగతి విదితమే. ఈ రోజు గురువారం మంత్రి హారీష్ రావు బెజ్జంకి మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో …
Read More »ఆలేరు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు గురువారం నియోజకవర్గ కేంద్రంలో ఆర్&బీ అతిథి గృహంలో నియోజకవర్గానికి చెందిన సర్పంచులతో ఎమ్మెల్యే గొంగిడి సునీత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో భవనం పైకప్పు పెచ్చులూడి పక్కనే కూర్చుని ఉన్న గొలనుకొండ సర్పంచ్ లక్ష్మీ,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మరుగాడు ఇందిరా …
Read More »యువనేత నాయకత్వంలో ఏడాదిలో ఎన్నో ఘన విజయాలు
ఉద్యమపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యం! ఒకవైపు పరిపాలన భారం.. మరోవైపు పార్టీ నిర్మాణ బాధ్యత! ఈ సమయంలో పూర్తిగా పరిపాలనపైనే దృష్టిసారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. పార్టీ బాధ్యతలను యువనేత కే తారకరామారావుకు అప్పగించారు. సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. సీఎం నమ్మకాన్ని వమ్ముచేయలేదు! పక్కా వ్యూహరచనతో పార్టీని విజయపథాన నడిపించడంతోపాటు.. క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ టీఆర్‌ఎస్‌ను …
Read More »హెచ్ఐసీసీలో మరో అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హైపర్మామెన్స్ కంప్యూటింగ్ ,డేటా అనలిటిక్స్ సదస్సు ఈ రోజు మంగళవారం నుండి హెచ్ఐసీసీలో జరగనున్నది. ఈ సదస్సుకు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు,పారిశ్రామిక వేత్తలు,పరిశోధకులు హాజరు కానున్నారు. ఈ కామర్స్ ,రిటైల్ ,హెల్త్ కేర్,ఇంజినీరింగ్ ,వ్యవసాయం ,వాతావరణం లాంటి పలు అంశాలపై అధ్యయనాలు,అత్యుత్తమ ప్రమాణాల గురించి సదస్సు జరగనున్నది.
Read More »తెలంగాణ ఓటర్ల సంఖ్య 2.98కోట్లు
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 2.98కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. జాబితా ప్రకారం వచ్చేడాది జనవరి ఒకటో తారీఖు నాటికి పద్దెనిమిదేళ్ళు నిండిన యువత ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక సవరణ షెడ్యూల్ ను ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి పదిహేను తారీఖు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఈసీ ప్రకటించింది. వచ్చే …
Read More »క్రిస్మస్ కానుకల పంపిణీ
గ్రేటర్ హైదరాబాద్ లో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సెవెంత్ డే చర్చిలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్స్ కు కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలను (దుస్తులను ) ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. పేదల …
Read More »కరీంనగర్ లో కాంగ్రెస్ ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల నిర్మల గోపాల్ ,వార్డు సభ్యులు ఉమా మహేశ్వరి,విద్యాసాగర్,గౌడ సంఘం నేతలతో పాటు వందమంది కార్యకర్తలు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ …
Read More »