తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లోఏమీ లేదు. …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖతర్ ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి బాటన పయనిద్దాం అనే నినాదంతో TRS NRI లు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 18 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొర్రొల్ల గంగారం గెలుపు కోసం TRS ఖతర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు నరేష్ కోరం గారు మెట్‌పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ …
Read More »హైదరాబాద్ కు అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్) నగరాల జాబితాలో భాగ్యనగరం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి …
Read More »మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న శనివారం వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు మహిళలు.. బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. రోడ్‌షోకు స్థానిక ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”కేంద్రంలో 70 ఏండ్లనుంచి పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేయని …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూకుడు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్ దూకుడును మరింత పెంచింది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న పది కార్పొరేషన్లలో భారీ విజయంపై ప్రత్యేక దృష్టిసారించింది.అందులో 10 కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్, రామగుండంతోపాటు, హైదరాబాద్ చుట్టూ ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో నిన్న ఆదివారం తెలంగాణభవన్ నుంచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, …
Read More »రైతుల కుటుంబాలకు భరోసానిస్తున్న రైతు బీమా..!
తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కుటుంబాలకు భరోసానివ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అత్యున్నత పథకం రైతు బీమా. అనారోగ్యం కారణంగా.. లేదా ఏదైన కారణంతో రైతు మరణిస్తే ఆ రైతును నమ్ముకుని ఉన్న కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో ఇప్పటికి పలు కారణాలతో అకాల మృతినొందిన దాదాపు …
Read More »తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి అన్నారు..ఏపీలో అమరావతి రాజధాని తరలింపుపై రేవంత్ రెడ్డి స్పందించారు.. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ”అమరావతిలో రైతులు ధర్నాలు,రాస్తోరోకులు చేస్తుండటం వలన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశం,అనిశ్చిత పరిస్థితులు చోటు చేసుకోవడంతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి.దీంతో తెలంగాణ రాష్ట్రా ఆదాయం పెరిగింది అని అన్నారు.దీనిపై …
Read More »మంత్రి హారీష్ రావు ఆరోగ్య సలహాలు…
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛ సిద్దిపేట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” మనం ఏది పోగోట్టుకున్న కానీ తిరిగి సంపాదించుకోవచ్చు.కానీ ఆరోగ్యం పాడైతే తిరిగి దాన్ని వెనక్కి తెచ్చుకోలేము” అని అన్నారు. మంత్రి హారీష్ రావు ఇంకా మాట్లాడుతూ”సిద్దిపేటలో ఉన్న పలు హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ శుచి,శుభ్రత లక్ష్యంగా మొత్తం ఇరవై సూత్రాలను …
Read More »అధికారంలో ఉన్న పార్టీకి పాలకవర్గం ఉంటే పెద్ద ఎత్తున నిధులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మధిర మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించే సత్తా టిఆర్ఎస్ పార్టీకి ఉందని మున్సిపాలిటీలోని ప్రజలు ఆలోచించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల …
Read More »సిద్దిపేటలో పట్టుదారం పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో పట్టు దారం పరిశ్రమను ఇండోరమ సింథటిక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు. సిరిసిల్ల,పోచంపల్లి,గద్వాల ,నారాయణ పేట్ ,కొత్త కోట చేనేత కార్మికులు పట్టుదారం కోసం బెంగుళూరుపై ఆధారపడుతున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే కార్మికులకు దూరాభారం తగ్గుతుంది. రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన …
Read More »