సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మంత్రి జగదీష్ రెడ్డి గారు తన మార్కు చూపించాడు. లక్షలు, కోట్లు దారపొసే సత్తా ఉన్న నాయకులను పక్కకు పెట్టి జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన్నప్పటి నుండి చైర్ పర్సన్ ఆశవహులు ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవన్నీ సావధానంగా వింటూనే తన నిర్ణయాన్ని అత్యంత గోప్యత పాటిస్తూ చైర్ పర్సన్ …
Read More »ఫలించిన తారక మంత్రం
సోషల్ మీడియాలో గులాబీ గుబాళించింది. మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడంతో సామాజిక మాధ్యమంలో ‘జై టీఆర్‌ఎస్..జై రామన్న.. జై కేసీఆర్..ఫలించిన తారకమంత్రం, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ’ అంటూ పోస్టులు వెల్లువెత్తా యి. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో దూసుకుపోతు న్న కారు బొమ్మలను నెటిజన్లు విరివిగా షేర్ చేశారు. సృజనాత్మకత రంగరంచి కారు ఫొటోలను చక్కర్లు కొట్టించారు. ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన ఉదయం నుంచే సోషల్ మీడియాలో నెటిజన్లు తమ …
Read More »హెలికాప్టర్ ప్రమాదంలో లెజండరీ ప్లేయర్ దుర్మరణం…కోహ్లీ.. కేటీఆర్ ట్వీట్
అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల …
Read More »కొడుకు ఎమ్మెల్యే.. తల్లి కౌన్సిలర్
ఇది నిజం. తనకు జన్మనిచ్చిన తల్లి కౌన్సిలర్ .. తను ఎమ్మెల్యే అయిన సంఘటన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకుంది. శనివారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు బాల్క సుమన్ తల్లి బాల్క ముత్తమ్మ గెలుపొందారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుమన్ తల్లి పదమూడో వార్డు నుండి టీఆర్ఎస్ …
Read More »తెలంగాణ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో డెబ్బై ఒకటో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ ఆలీ,శ్రీనివాస్ గౌడ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ ,ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్ది తదితరులతో పాటుగా పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా …
Read More »57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా …
Read More »మరోసారి వార్తల్లోకి మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి నెటిజన్ల మనస్సును దోచుకున్నారు. ఒకవైపు రాజకీయ కార్యక్రమాలు.. మరోవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటునే ఇంకోవైపు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు మంత్రి కేటీ రామారావు. ట్విట్టర్లో సమస్య ఉందని పోస్టు చేయగానే వెంటనే స్పందించి నేనున్నాను అని భరోసానిస్తారు మంత్రి. తాజాగా అర్షద్ అజీజ్ అనే వ్యక్తి తన …
Read More »సిరిసిల్లలో కారుదే పీఠం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. సిరిసిల్లలో మొత్తం 40 వార్డులకు గానూ 39 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 వార్డులను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్ 2, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. 01.వార్డ్ : పోచయ్య సత్య టీఆర్ఎస్ 02.వార్డ్ : రాపల్లి దిగంబర్ …
Read More »భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్‌ఎస్ గెలుపు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. కొత్తగూడం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 25 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ-1, ఇతరులు-10 వార్డుల్లో గెలుపొందారు. అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్-18, కాంగ్రెస్-1, ఇతరులు-5 స్థానాల్లో గెలుపొందారు.
Read More »మంత్రి కేటీఆర్ కు మంత్రి హారీష్ కంగ్రాట్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇటు కార్పొరేషన్లలోనూ, అటు మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అభినందనలు తెలియజేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. …
Read More »