వర్థన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఎన్నికలల్లో పోటీచేసే అభ్యర్ధులు, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్థన్నపేటలోని సహకార సోసైటీలో అన్నింటిని ఏకగ్రీవం అయ్యేవిధంగా చూడాలని, …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కౌసల్య
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య . ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా …
Read More »శభాష్ తెలంగాణ పోలీస్
దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …
Read More »సీఎం కేసీఆర్ రెండో సోదరి భర్త కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్ మంగాపురిలో రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. రాజేశ్వర్‌రావు మృతి వార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. ఉదయమే మంగాపురికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోనే రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read More »తెలంగాణ ఓటర్ల తుది జాబితా ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేస్తూ విడుదల చేసింది. ఇందులో కొత్త ఓటర్ల మార్పులు,చేర్పులు ,కొన్ని తీసివేతల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ జాబితాను విడుదల చేసింది. మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో 2,99,32,943మంది ఓటర్లు ఉన్నారని తేలింది. ఇందులో పురుషుల ఓటర్ల సంఖ్య 1,50,41,943.. మహిళల ఓటర్ల సంఖ్య 1,48,89,410.. ఇతరులు 1590 ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. …
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కామారెడ్డి కలెక్టర్ భేటీ
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియామకమైన ఐఎఎస్ డా.శరత్ శనివారం మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కలెక్టర్ శరత్ ను అభినందించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,కొత్త స్కీమ్ లు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కు …
Read More »పుణె మహిళ మగశిశువుకు జన్మ.. కేసీఆర్ కిట్ అందజేత..
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ మహిళ మేడారంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జాతరకు మూడురోజుల క్రితం చవాన్ శివాని, గోవిందర్ కుటుంబం మేడారం చేరుకొన్నారు. గర్భిణి అయిన శివానితో కలిసి కుటుంబసభ్యులు గురువారం ఉదయం వనదేవతలను దర్శించుకొన్నారు. అంతలోనే నొప్పులురావడంతో శివానీని దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు శివానీకి సాధారణ ప్రసవం చేశారు. ఉదయం 11.48 గంటలకు శివానీ మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు మూడున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. …
Read More »వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …
Read More »మేడారం జాతర జనసంద్రం
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారానికి భక్తులు,ఆశేష జనసందోహాం తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈరోజు రేపు భారీగా భక్తులు తరలివస్తారని భావించిన అధికారులు దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.రేపు శనివారం …
Read More »తెలంగాణ పోలీస్ కింగ్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగానికి మరో ఘనత దక్కింది. పోలీసింగ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలోని పోలీస్ సీసీ కెమెరాల్లో సగానికి (2.75లక్షలు)పైగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ,సిబ్బందికి సదుపాయలు కల్పనలో కూడా తెలంగాణ ముందంజలో ఉన్నట్లు డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొంది. అలాగే అత్యధిక పోలీస్ క్వార్టర్స్ ఉన్న రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచింది. పోలీసులకు …
Read More »