తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ …
Read More »పార్లమెంట్ దుర్ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
పార్లమెంట్ లో బుధవారం జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి చేత తక్షణమే సమగ్ర ప్రకటన చేయించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓo బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ దుర్ఘటన పై చర్చించేందుకు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం ఎంపీ నామ నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. …
Read More »హైదరాబాద్ లో ఎన్నికల హాడావుడి
తెలంగాణలో ఇటీవలే కదా ఎన్నికలు ముగిసింది. మళ్లీ ఎన్నికల హాడావుడి ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఖాళీ అయిన మూడు కార్పోరేట్ డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి జీహెచ్ఎంసీ లేఖ రాయనున్నది. నగరంలోని గుడిమల్కాపూర్ బీజేపీ కార్పోరేటర్ దేవర కరుణాకర్ మృతి చెందారు. శాస్త్రిపురం డివిజన్ కార్పోరేటర్ మహ్మద్ ముబిన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటి …
Read More »మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన భట్టి,శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ రాయితీకి సంబంధి రూ.374 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య …
Read More »భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేసు నమోదైన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇది ప్రభుత్వ కక్షకాదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు రావడంతో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. 47 ఎకరాలు …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వివిధ పార్టీల సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మేల్యేలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, …
Read More »ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్ పట్టణంలో పర్యటించారు. ప్రగ్ఞాపూర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు గజ మాలతో స్వాగతం పలికాయి. అనంతరం మంత్రి గజ్వేల్ పట్టణంలోని తూముకుంట నర్సారెడ్డి స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలివడితే 9వ తేదీన …
Read More »పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. …
Read More »రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతుబంధు డబ్బులు వేస్తాము.. బ్యాంకులకెళ్ళి రెండు లక్షల రుణాలను తెచ్చుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్.. ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా రైతుబంధు డబ్బులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి …
Read More »ఆటా ఆధ్వర్యంలో ఈ 20 రోజులు సేవా కార్యక్రమాలు
ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ…ఆటా సంస్థ 1991లో స్థాపించబడి గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్ కు పైగా తెలుగు వారి …
Read More »