తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాల మేరకు కరోన వైరస్ ప్రభావం వల్ల ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని వివాహాలకు శుభకార్యాలకు ఎక్కువమంది హాజరు కావద్దన్న ఆదేశాల మేరకు గత ఆరు సంవత్సరాలుగా తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తు తనను కంటికి రెప్పలా కాపాడుకోంటు వస్తూన్న నరేందర్ గౌడ్ ;ఉమారాణిల వివాహం ఈ రోజు భువనగిరి పట్టణం నందు వైఎస్ఆర్ గార్డెన్ లో జరిగినది. ఈ వివాహానికి రాజ్యసభ …
Read More »తెలంగాణలో మరో 2 పాజిటీవ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాల నుండి వచ్చేవాళ్లను పలు పరీక్షలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు మరో రెండు కొత్తగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. విదేశాల నుండి వచ్చిన వారిలోనే …
Read More »అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు
పిల్లలు, బాలింతలు, గర్భిణీలుండే అంగన్ వాడీ కేంద్రాలలో, మినీ అంగన్ వాడీలలో కరోనా వైరస్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించాలని, ఎలాంటి నిర్లక్యానికి తావివ్వకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఆరోగ్య లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోపు వండి, వేడి, వేడిగా తల్లులకు, …
Read More »కరోనా నివారణకు తెలంగాణ చర్యలు భేష్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుంది.కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిచెందిన దేశాలకంటే ముందంజలో ఉన్నదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రశంసించింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై కంటే హైదరాబాద్‌లోనే వ్యాధి నివారణ చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఆయుష్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ పీవీవీ ప్రసాద్, రిసెర్చ్ అధికారి డాక్టర్ సాకేత్‌రాం తిగుళ్ల కొనియాడారు. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో …
Read More »మంత్రి ఈటలకు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి ,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సాక్షిగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ”ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత కాలం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు పార్టీకి చెందిన పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు ,ఇతర ముఖ్య నేతలు,కార్యకర్తలు మంత్రి ఈటలకు పుట్టిన …
Read More »విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురండి.. మోదీకి కేటీఆర్ ట్వీట్
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని భారతీయులంతా విమానాశ్రయాల్లోనే ఉండిపోయినట్లు సమాచారం అందుతోందని కేటీఆర్ తెలిపారు. మనీలా, రోమ్, సింగపూర్, కౌలాలంపూర్ విమానాశ్రయాల్లో ఉన్నట్లు సందేశాలు వచ్చాయి. వారందరినీ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ ప్రధాని మోదీకి వినతి చేశారు.
Read More »కరోనా నివారణకు మంత్రి కేటీఆర్ సూచనలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ బారీన పడకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచిస్తూ ఐదు సలహాలు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు అవగాహనతో ముందుకు సాగాలని అన్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఐదు సూత్రాలను సూచిస్తూ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో ఇతర …
Read More »తెలంగాణలోనే తొలిసారి
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటిఇంటికెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన పదకొండు మంది ప్రచారకుల్లో ఏడుగురికి కరోనా పాజిటీవ్ అని తేలడంతో అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి రామగుండం వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్లో వాళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎస్ 9 బోగీలో ఉన్నవాళ్లందరూ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అటు నగరంలో 144సెక్షన్ …
Read More »కరోనాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఒకటి అయిన ఆర్టీసీ బస్సులలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ప్రతి బస్సులోనూ శానిటైజర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది ప్రభుత్వం. బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికుడికి కండక్టర్ టికెట్ తో …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకి ఘన స్వాగతం
తెలంగాణ లో కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కవిత …
Read More »