తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.
Read More »హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Read More »ఎల్బీనగర్‌లో జంట రిజర్వాయర్లు ప్రారంభం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మరో రెండు భారీ అధునాతన రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. శనివారం రూ. 9.42 కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ 2.5ఎంఎల్ కెపాసిటీ గల రెండు మంచినీటి రిజర్వాయర్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. హడ్కో నిధులు రూ. 325 కోట్లతో …
Read More »లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
బాగ్‌లింగంపల్లిలోని లంబాడీ తండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు …
Read More »గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి …
Read More »గ్రేటర్లో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా దోమలగూడలో జోనల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం పనులకు, నారాయణగూడలో మోడ్రన్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ మేయర్ …
Read More »త్వరలోనే సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 651 ఉద్యోగాలను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్ …
Read More »గ్రేటర్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూసుఫ్‌గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు …
Read More »సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు
లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కారణంగా నిన్న సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఇవాళ మరికొన్ని పరీక్షలు చేయించుకునేందుకు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్లనున్నారు. ఎంఆర్ఐ, సిటీస్కాన్‌తో పాటు తదితర పరీక్షలు సీఎం చేయించుకోనున్నారు.
Read More »త్వరలో తెలంగాణలో 1400 మంది రేషన్ డీలర్ల నియామకం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని …
Read More »