తెలంగాణలో వేరుశనగ ధర భారీగా పెరిగింది. గద్వాల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ కు గరిష్ఠంగా రూ.8,376 ధర పలికింది. మద్దతు ధర రూ.5,225ను మించి ఉండటంతో రైతులు సంబరపడుతున్నారు. వనపర్తి మార్కెట్లో గత ఏడాది రూ.3,500 నుంచి రూ.5,000 లోపు ఉన్న వేరుశనగ ఈ ఏడాది ఏకంగా రూ.7,942 పలుకుతోంది. ఇక్కడి వేరుశనగకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. గతేడాది భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో రికార్డు స్థాయిలో ధరలు …
Read More »బంగారు తెలంగాణకు పునాదులు-గవర్నర్ తమిళిసై
సరికొత్త విజన్, కొత్త పథకాలు, నూతన ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదాల్చిందని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ అన్నారు. ఆరున్నరేండ్లలో ఆకలిదప్పులు, ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. 72వ గణతంత్ర వేడుకలు మంగళవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ పతాకావిష్కరణ చేసి.. వివిధ భద్రతాదళాల గౌరవ వందనం స్వీకరించారు.ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మండలి చైర్మన్ …
Read More »స్వావలంబిత సామ్యవాది సీఎం కేసీఆర్….
దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించేది కేంద్రమే తప్ప రాష్ర్టాలు కాదు. దాన్ని రాష్ర్టాలు శిరసావహించాలి. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల పయనానికి మూడు దశాబ్దాలు దాటింది. ఆర్థిక సంస్కరణ అనేది ప్రజల కోసం జరగాలి. అలా జరిగినవాటిని, జరుగుతున్న వాటిని స్వాగతిద్దాం. కానీ సంస్కరణ అంటే వ్యాపారం/వ్యాపారుల కోసమే జరగడం పట్లనే అభ్యంతరాలు. సంస్కరణలకూ ఓ పద్ధతి, ప్రజానుకూలత పాటించకపోవడం వల్లనే దేశంలో మౌలిక సదుపాయాలకు పెను ప్రమాదం వచ్చి …
Read More »సచివాలయ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
నూతన సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవనాల నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగారు. నిర్మాణ పనుల్లో నిమగ్నమైవున్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు. నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సెక్రటేరియట్ ప్రధాన గేట్ తో పాటు,ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలతో సహా, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కలియ తిరగారు. డిజైన్లను పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి …
Read More »పారే నీళ్లను చూడలేని కళ్లు!
‘ఇది కాళేశ్వరం కాదు, తెలంగాణకు పట్టిన శనేశ్వరం.. వరదలు వస్తే మోటర్లు బంజేసుకునే ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంది అంటే, అది మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే.. రీ డిజైన్‌లో భాగంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో మోటర్లను 800 అడుగుల నుంచి 821 అడుగుల వద్ద వరదకు అందనంత ఎత్తులో పెట్టారు..’ ఇవీ.. ఈ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన మెసేజ్‌లు. మిడిమిడి జ్ఞానంతో, కాళేశ్వరం …
Read More »తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,93,590కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 1,589కి చేరింది. ఇప్పటివరకు 2,88,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి వీరిలో 1,543 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
Read More »మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజమైన సమాఖ్యస్ఫూర్తి పరిఢవిల్లేలా భారత ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ బలపడాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమం
తెలంగాణ మత్స్యశాఖ మరో వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతోపాటు.. వాటి విక్రయం ద్వారా మహిళలూ ఉపాధి పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం చేపలతోపాటు, చేపల వంటకాలనూ విక్రయించేలా తయారుచేసిన సంచార విక్రయ వాహనాలను (మొబైల్ ఫిష్ ఔట్‌లెట్స్) అందుబాటులోకి తెచ్చింది. గ్రూపులుగా ముందుకొచ్చే మహిళలకు వీటిని అందజేయాలని నిర్ణయించింది. దీనిద్వారా నిరుద్యోగ మహిళలకు ఉపాధి అందనుండగా.. వినియోగదారుడికి తన …
Read More »అన్ని కులాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలోని అన్ని కులాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి/కుల్లె కడిగి/చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభా ఆదివారం జరిగింది. ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు …
Read More »కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా-ఎమ్మెల్యే కెపి వివేకానంద్
గాజుల రామారం డివిజన్ బేకారి గడ్డలో మంచి నీటి సరఫరా కూలాయి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కే.పి.వివేకానంద్ పాల్గోన్నారు..గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో కోట్ల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని బేకారి గడ్డలో మంచి నీటి …
Read More »