వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదలరంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పర్యటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతిపై సమాలోచనలు చేశారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా స్థానికంగా పర్యటించి, అమలవుతున్న …
Read More »రాజస్థాన్ రాళ్లతో తెలంగాణ సచివాలయం
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.
Read More »హమాలీల ఛార్జీలు పెంపు
తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ పెంచిన హమాలీల ఛార్జీలు 2021 జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు
Read More »తెలంగాణలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.
Read More »తెలంగాణలో విద్యా వాలంటీర్ల నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో.. 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు …
Read More »కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం-మహారాష్ట్ర మంత్రి విజయ్ ఓడేటివార్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విజయ్ ఓడేటివార్ కొనియాడారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జీఆర్‌ఆర్ కాటన్ మిల్లును ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విజయ్ ఓడేటివార్ మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల …
Read More »సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్
సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్ నిర్మింప చేసేందుకు, స్థానిక పాత బస్టాండ్ ఆధునీకరణ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసీ అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను …
Read More »ఆ ఘనత సీఎం కేసీఅర్ దే..
ఒకవైపు సంక్షేమంలో మరోవైపు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తొక్కేయాలని చూస్తు న్నా, రాష్ట్రాభివృద్ధికి అవార్డులు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సీఎం కేసీఆర్ విధానాలపై ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ …
Read More »గ్రేటర్ మేయర్ మద్ధతుదారులకు రూ.6లక్షలు జరిమానా
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 …
Read More »YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే …
Read More »