Home / Tag Archives: ktr (page 334)

Tag Archives: ktr

అద్భుత రికార్డు.. చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం

తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే నీటి పంపింగ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్యశ్యామంగా మారుతున్నాయి. * చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంగా రికార్డు నెలకొల్పింది. మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి …

Read More »

దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల బాంధ‌వుడు

దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల బాంధ‌వుడు అని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈరోజు శాస‌న‌స‌భ‌లో నోముల మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి మ‌ద్ద‌తు తెలిపారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిది సంవ‌త్స‌రాలుగా నోముల‌తో అనుబంధం ఉంది. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మున్సిపాలిటీలు లేవు. 15 వేల పైచిలుకు జ‌నాభా ఉండే మేజ‌ర్ గ్రామ‌పంచాయ‌తీల‌ను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో …

Read More »

మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ లో చేరిన తన నియోజకవర్గ కేంద్రం ధర్మపురి కేంద్రానికి చెందిన దేవి శంకర్ చికిత్స కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ప్రభుత్వం నుంచి 3లక్షల రూపాయలు మంజూరు చేయించారు.ఇందుకు సంబంధించిన LOC పత్రాన్ని శంకర్ భార్య దేవి అంజలి చేతికి మంత్రి అందించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా బాధపడుతున్న శంకర్ శనివారం నిమ్స్ లో చేరారు. విషయం తెలుసుకున్న కొప్పుల వెంటనే …

Read More »

తెలంగాణ‌ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగం ప్రారంభించారు. ఈ స‌మావేశాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం స్పీక‌ర్ పోచారం అధ్య‌క్ష‌త‌న బీఏసీ(స‌భా వ్య‌వ‌హారాల సంఘం) స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

Read More »

జీహెచ్ఎంసీలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు

Read More »

జనంలోకి వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జిల్లాల వారీగా వైఎస్ అభిమానులు ఇతర నేతలతో భేటీ అయిన షర్మిల ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో మెదటి బహిరంగ సభ …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు వీళ్ళే..!

 రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ క్యూలైన్‌లో బారులు తీరి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టభద్రులంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని, అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఓల్డ్‌ మలక్‌పేటలోని అగ్రికల్చర్‌ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని …

Read More »

ఓటు వేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలోమంత్రి కేటీఆర్ ఓటేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటేశాను. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి మద్దతుగా నిలిచాను. విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ …

Read More »

టీఆర్ఎస్ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజు మంత్రి కేటీఆర్ “సర్ ప్రైజ్ గిఫ్ట్”

కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్ లోనే ఉంటూ …

Read More »

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 52 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat