హైదరాబాద్‌లో మరో బహుళజాతి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను బుధవారం నానక్‌రామ్‌గూడలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. అమెరికాకు బయట మెడ్‌ట్రానిక్ సంస్థ ఏర్పాటుచేసిన అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ సెంటర్‌లో 160 మిలియన్ డాలర్ల (రూ.1200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో దాదాపు వెయ్యిమందికి ఈ సెంటర్‌లో …
Read More »కంటతడిపెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి..ఎందుకంటే..?
అనుంగ అనుచరుడు, నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దివంగత కర్నాటి విజయభాస్కర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మంత్రి జగదీష్ రెడ్డి కన్నీటిపర్యంతంగా విలపించారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈ సాయంత్రం పెద్దవూర మండల కేంద్రంలో టి ఆర్ యస్ పార్టీ ధూమ్ ధామ్ ను నిర్వహించింది. ఈ సభకు మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్,ప్రభుత్వ విప్ …
Read More »మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో మైనార్టీల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనారిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని తెలిపారు. పేదరికం తొలగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 210 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన : మంత్రి కేటీఆర్
నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్ ట్రానిక్.. రూ. 1200 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్ పనిచేస్తున్నది. ఈ సంస్థ …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్
తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ గారు మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా …
Read More »6 వేల మీటర్ల తవ్వగల స్వదేశీ ఆయిల్ రిగ్గులు
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు …
Read More »ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం ఇండ్లకు సరఫరా చేస్తున్నం. ప్రజలను రోగాల నుంచి కాపాడగలుగుతున్నం. ఫలితంగా ప్రజారోగ్యంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. అదే సందర్భంలో తల్లీ బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతమై, మాతాశిశు సంక్షేమం మెరుగు పడింది. -ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన …
Read More »సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read More »హల్దీ, గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వర జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా …
Read More »