తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,840 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇందులో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 3,09,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 9 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది.
Read More »జీహెచ్ఎంసీ పరిధిలో 505 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలో గడచిన 24 గంటల్లో మరో 505 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 88, 812కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి అజ్మీరా చందులాల్(66) మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ జిల్లా ములుగు (మం) జగ్గన్నపేటలో జన్మించిన ఆయన తెలంగాణ రాష్ట్ర టూరిజం& సాంస్కృతికశాఖకు తొలిమంత్రిగా సేవలందించారు. దివంగత మాజీ సీఎం,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కేబినెట్లోనూ గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ములుగు నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు ఎంపీగా గెలిచారు. కరోనాకు చికిత్స …
Read More »తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు
తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. రాష్ట్రంలో కూడా పబ్లిక్ పరీక్షల నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం – 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్
తెలంగాణలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల …
Read More »ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు రిజర్వేషన్ల జాబితాను ఇవాళ విడుదల చేశారు. 1, 8 డివిజన్లు ఎస్టీ జనరల్, 32వ డివిజన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. 22, 42, 59 డివిజన్లను ఎస్సీ మహిళలకు, 40, 43, 52, 60 డివిజన్లను ఎస్సీ జనరల్‌కు, 28, 29, 30, 33, …
Read More »సీఎం కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కేసీఆర్ పై ఆమె మండిపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం,ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణ వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పించారన్నారు. అదే మంత్రి మల్లారెడ్డిపై వందల ఆరోపణలొస్తున్నా.. బర్తరఫ్ చేయట్లేదు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో లోటస్ పాండ్ లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి …
Read More »రైతుల పాదాలు కడుగుతున్నాం : సీఎం కేసీఆర్
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే …
Read More »రేషన్ కార్డులపై సీఎం కేసీఆర్ శుభవార్త
కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 57 ఏండ్ల వయసు ఉన్న వారికి పెన్షన్లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి …
Read More »అచ్చంపేట అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్కర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ …
Read More »