తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »ఐటీలో తెలంగాణ దేశానికి ఆదర్శం
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. సీఎం దార్శనికతతో దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని చెప్పారు. నగరంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని …
Read More »డయాగ్నస్టిక్ హబ్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఐకే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంందించే …
Read More »ప్రముఖ గేయ రచయిత కందికొండ కు మంత్రి కేటీఆర్ చేయూత
ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. …
Read More »కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వైద్య రంగంలో అవసరమైన పలు పరీక్షల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయాగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు బుధవారం నాడు డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ …
Read More »రేపటి నుండి మెట్రో పరుగులే పరుగు
తెలంగాణలో లాక్‌డౌన్ గడువును పెంచుతూ ప్రభుత్వం మంగళవారం తీసుకున్న నిర్ణయంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఈ మేరకు ఈనెల 10 నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు 5.30 గంటలకు బయలుదేరి చివరి స్టేషన్‌కు 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన వేళలను బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
Read More »అంజయ్య కుటుంబానికి అండగా ఉంటా-మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా అంజయ్య తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని కేటీఆర్ కొనియాడారు. అంజయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అన్ని …
Read More »సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని …
Read More »తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ కీలక నిర్ణయాలు ….. రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి …
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వ ద్యేయం- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తెలంగాణలో హైద్రాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కేంద్రాలను ( డయాగ్నస్టిక్ సెంటర్లు) ఈనెల 9వ తేదిన ప్రారంభించబడతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు పరీక్ష చేసి మందులు …
Read More »