మాజీ మంత్రి కభ్జా ఆరోపణల నేపథ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజెందర్ పై రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువత చేరిన కార్యక్రమంలో గంగుల కమలాకర్ పాల్గొని వారికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని ఇష్టానుసారంగా అనుచిత వాఖ్యలు …
Read More »ఈ నెల 22న వాసాలమర్రికి సీఎం కేసీఆర్
ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ నెలలో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికులతో చర్చించిన సంగతి తెలిసిందే.
Read More »లేక్ వ్యూ డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు త్వరలోనే అందజేస్తున్నందుకు గర్వంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మురికివాడగా ఉన్న ఏరియాను అభివృద్ధి చేసి, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడంపై …
Read More »రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణపై మంత్రి గంగుల విడియో కాన్పరెన్స్
నూతన రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణ అంశాలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టరేట్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఎంలు, డిఎస్వోలతో విడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పౌరసరఫరాల కార్యాలయం నుండి కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీపై కాబినెట్ సబ్ కమిటీ సూచించిన విదంగా పెండిగ్లో …
Read More »ఏడో విడత హరితహారానికి సిద్ధం
ఏడవ విడత హరిత హారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవు తోంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేయనున్నారు. వర్షాల జోరు మరింత పుంజుకోగానే జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని అట్టహా సంగా ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాటు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దఎత్తున నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర …
Read More »విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?
వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీటివసతి కల్పించడం లక్ష్యంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును, అనుబంధ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మింపజేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఎంత విలవిలలాడిందో గమనించిన వారికి మన రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిందేమిటో అర్థమవుతుంది. …
Read More »రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ పూర్తి అయినట్లు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వానాకాలం, యాసంగిలో కలిపి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. ఒక్క యాసంగి సీజన్‌లోనే 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగినట్లు తెలిపారు. మరో 50 వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు …
Read More »తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. జిల్లా కేంద్రాల్లో ఇటీవలే 19 డయాగ్నోస్టిక్ హబ్స్‌ను ప్రారంభించారని తెలిపిన కేటీఆర్.. 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ కరుణ, డాక్టర్ అరుణ్, డాక్టర్ నందిత, డాక్టర్ ప్రసాద్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య …
Read More »రాబడులను పూర్తిగా కోల్పోయాం:-మంత్రి కేటీఆర్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి …
Read More »ఈ నెల 26న నెక్లెస్‌రోడ్డు లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. నగరంలోని నెక్లెస్‌రోడ్డు అంబేడ్కర్ నగర్‌లో నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గురువారం పరిశీలించారు. ఈ నెల 26వ తేదీన ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. …
Read More »