హుజురాబాద్ నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం నియోజకవర్గంలో ని 20 వేల కుటుంబాల కు పైగా …
Read More »యాదాద్రిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతం మంత్రి తలసాని దంపతులకు పండితులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. వారివెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.
Read More »రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూ అద్భుతం
తెలంగాణలో జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడతున్నాయి. గోదావరి నీళ్లతో సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు కళకళలాడుతోంది. ప్రాజెక్టు చుట్టూ పచ్చదనం పరుచుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఆ ప్రాంతం. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. రంగనాయక సాగర్ ఏరియల్ వ్యూను హరీశ్‌రావు తన కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ వద్ద …
Read More »సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్
బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …
Read More »ఆగస్టు 15 నుండి రూ. 50 వేల వరకు పంట రుణాల మాఫీ
రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది కొంత మొత్తాన్ని మాఫీ చేసిన కేసీఆర్ సర్కార్ ఈసారి మరికొంత మాఫీని చేయాలని నిర్ణయించింది. …
Read More »ప్రతి దళితుడికి ఆర్ఠిక సాయం అందాలి- సీఎం కేసీఆర్
దళితుల్లో సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం రూ. …
Read More »తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ కార్లు
తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూవర్స్(టీ-ప్రైడ్) పథకం కింద ఎస్సీ, ఎస్టీ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ కార్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి కార్లను పంపిణీ చేయనున్నారు. ఇంతకుముందు జీహెచ్‌ఎంసీ, మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘డ్రైవర్ కమ్ ఓనర్’ పేరిట నిరుద్యోగ యువతకు సబ్సిడీపై కార్లను అందించారు. ఎస్సీ, ఎస్టీ యువతకు కూడా టీ-ప్రైడ్ పథకం కింద కార్లను అందించాలని …
Read More »దేశానికి ఆదర్శంగా తెలంగాణ
అద్భుతమైన సంక్షేమ పథకాల ఆవిష్కరణ, అమలులోనే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంలోనూ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వీధివ్యాపారులు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును …
Read More »ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు అగ్రహజ్వాలలు
హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిస అంటూ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ కులాలు మండిపడ్డాయి. బీసీ సమాజానికి ముఖ్యంగా యాదవులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈటల గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. గురువారం యాదవులు వరంగల్‌అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ ఇన్‌చార్జి …
Read More »తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్‌బోర్డు చరిత్రలో ఫస్టియర్‌లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో …
Read More »