తెలంగాణలో ఏడేండ్ల కిందట రైతుల ఆత్మహత్యలు.. ఆగమైపోయిన బతుకులు.. కరంటు రాదు.. మంచినీళ్లు రావు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు. ఇయ్యాల అవన్నీ ఉన్నయా? ఈ రోజు నా తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. పండిన పంటను గుంజలేక లారీలకు, మోయలేక హమాలీలకు దమ్మొస్తున్నది. రాష్ట్రం ఇంకా ప్రగతి సాధించాలె. కరువు కాటకాల్లేని, సస్యశ్యామల తెలంగాణ కావాలె. అదే పద్ధతిలో గతంలో అణిచివేతకు గురైన, తెలంగాణ రాష్ట్రంలో …
Read More »డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ వేదికపై దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి.. 15 మంది లబ్దిదారులకు చెక్కులను అందించనున్నారు. ఈ పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 20 వేలకు పైగా దళిత కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
Read More »మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్
హుజూరాబాద్‌లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువర్ణ అవకాశం. మన నిర్ణయంతో భారత దళిత జాతి మేల్కొంటుంది. ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటుంది. పిడికెలిత్తి అడుగుతది. దళిత బిడ్డలకు లాభం జరుగుతది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మీరు చాలా బాధ్యతగా హుజూరాబాద్‌లో విజయవంతం చేసి చూపి పెట్టాలె. …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
దళిత బంధు పథకం ప్రారంభోత్సవ వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ బొజ్జా దళితుడే. వాళ్ల నాన్న బొజ్జా తారకం.. ఉద్యమంలో పని చేసిన వారికి న్యాయవాదిగా ఉండే. గొప్ప న్యాయవాది. ఆయన కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే …
Read More »దళితబంధును విజయవంతం చేసే బాధ్యత దళిత యువతదే: సీఎం కేసీఆర్
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్ననే 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్‌కైనా వచ్చిందా? ఆ దిశగా …
Read More »ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధు వర్తింపు : సీఎం కేసీఆర్
ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ రోజు హుజూరాబాద్ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పథక అమలు తీరును వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘హుజూరాబాద్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. హుజూరాబాద్ కాడ అందరికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు …
Read More »హుజూరాబాద్‌కు 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు: సీఎం కేసీఆర్
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితబంధు పథక ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ‘హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భారతదేశ దళిత ఉద్యమానికి పునాది పడుతుంది. హుజూరాబాదే పునాది రాయి అవుతుంది. నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్నట్లు లెక్క ఉన్నది. ఇంకో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవకాశం ఉంది. రూ.500 …
Read More »దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది: కేసీఆర్
భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ నాల్గో దశలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎస్సీలకు దళితబంధు ఇస్తామని ప్రకటించారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని, దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలన్నారు. దళితబంధు ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని దుయ్యబట్టారు. …
Read More »చలో హుజురాబాద్ బస్సు యాత్రను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ హుజూరాబాద్ వైపు వెళ్తున్నాయి. నిర్మల్ నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, దళిత సోదరులు ప్రత్యేక బస్సులో తరలి వస్తున్నారు. ఈ బస్సు యాత్రను నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో దళిత సోదరులు హుజూరాబాద్‌కు బయలుదేరారు. మంత్రి మల్లా రెడ్డి …
Read More »హుజూరాబాద్ లో దళిత బంధు సంబురం
హుజూరాబాద్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దళిత వాడలు మెరిసిపోతున్నాయి. ఆడపడుచులు మురిసిపోతున్నారు. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో హుజూరాబాద్‌లోని దళిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిని సుందరంగా అలంకరించుకున్నారు. తమ నివాసాల ముందు రంగవల్లులు వేసి.. దళిత బంధు అని చక్కగా రంగులు వేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. అనే పదాలు రాసి.. గులాబీ పార్టీపై తమకున్న అభిమానాన్ని …
Read More »