తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరి, …
Read More »పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాలపై హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి …
Read More »ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం.. ఇక తగ్గేదేలేదు
విపక్షాల నాయకుల మాటలకు ఏడేండ్ల నుంచి మస్తు ఓపిక పట్టినం. ఇగ చాలు..బరాబర్ ఇకనుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లే సమాధానం చెబుదాం. వెనక్కు తగ్గేదేలేదు’ అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్.అన్నారు. జలవిహార్‌లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో కేసీఆర్‌కు మనీ పవర్ లేదు, …
Read More »హుజూరాబాద్ లో ఇప్పటివరకు 12,521 మందికి దళిత బంధు
దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »చేనేత రంగానికి రూ.73.42 కోట్లు విడుదల
చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్ క్రెడిట్ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష …
Read More »సహాయక చర్యలు ముమ్మరం చేయండి.!
ప్రస్తుతం వర్షం నేపథ్యంలో తెలంగాణలో,హైదరాబాద్ మహనగరంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించండి. సిరిసిల్ల పట్టణంలో వరద ఉదృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫిరెన్స్ .వరద ప్రభావిత కాలనీలకు హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలింపు.వరద నీరు మల్లింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచన. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు …
Read More »మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం
ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది వరకు వాహనాల రాకపోకలను నిలిపేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నగర పౌరులు కుటుంబ సభ్యులతో సందడి చేశారు. సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్‌సాగర్‌లో లేజర్ షో …
Read More »మంత్రి పువ్వాడ నాయకత్వంలో ఖమ్మంలో కారు పార్టీ జోరు
తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్సాహం వచ్చింది అనటంలో ఎటువంటి సదేహం లేదు. మంత్రి గా భాద్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీకి విజయాలే తప్ప ఓటమి చవి చూడలేదు దానితో జోష్ లో పార్టీ కేడర్ ఇటీవల పార్టీ అధిష్ఠానం సంస్థాగత నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యకర్తల్లో నూతన …
Read More »పశు సంవర్ధకశాఖలో తెలంగాణ పథకాలు భేష్
పశు సంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. వివిధ రాష్ర్టాల పశు సంవర్ధకశాఖ మంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. ఇదేస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పశు సంవర్ధకశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు. కులవృత్తులకు ప్రాణం పోసేలా …
Read More »ఆడిట్‌లో మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
గ్రామ పంచాయతీల ఆడిట్‌లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 3,636 పంచాయతీల లెక్కలను ఆన్‌లైన్‌లో ఆడిట్‌చేసి నివేదికలను ఆయా గ్రామాలకు పంపారు. ఈ క్రమంలో 68,737 అభ్యంతరాలను నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏడాది 28 శాతం గ్రామాల ఆడిట్ పూర్తిచేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. కేవలం 443 గ్రామాల ఆడిట్ పూర్తిచేసిన ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలువగా.. …
Read More »