ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాజు ఆత్మహత్యపై అతడి అత్త యాదమ్మ ఏబీఎన్‌తో మాట్లాడారు. తన కుమార్తె మౌనిక జీవితం నాశనం చేశాడని చెప్పారు. తన కూతురు జీవితంలో మన్నుబోయడమే కాక మరో చిన్నారి జీవితాన్ని కూడా నాశనం చేశాడని, అతడికి బతికే హక్కులేదని యాదమ్మ తెలిపారు. ఆత్మహత్య చేసుకుని మంచి పని చేశాడన్నారు. తన కుమార్తెకు వచ్చిన పరిస్థితి …
Read More »నేటినుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్.
తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు గురువారం నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గ్రామస్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం చేపట్టే స్పెషల్ డ్రైవ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌పై బుధవారం హనుమకొండ జిల్లాకేంద్రం నుంచి జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ …
Read More »నేడు Telangana కేబినెట్ మీటింగ్.. పలు అంశాలపై CM KCR కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 25 నాటికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరునెలలు పూర్తవుతున్నందున ఈలోగా సమావేశపరచాల్సి ఉన్నది. వాటి తేదీలను క్యాబినెట్ భేటీలో నిర్ణయించనున్నట్టు తెలిసింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా చర్చ జరగనుంది. దళితబంధు పథకంపై ఇచ్చే స్టేట్‌మెంట్‌పైనా చర్చించి …
Read More »తెలంగాణలో మలబార్ గ్రూప్ భారీ పెట్టుబడి
ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గ్రూప్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడి పెడ్తామని ఆ సంస్థ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన తన ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ పెట్టుబడులతో గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తమ పెట్టుబడితో 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి లభిస్తుందని సంస్థ తెలిపింది. …
Read More »హైదరాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహా నగరంలోని సైదాబాద్‌లో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల రాకతో పోలీసులు సింగరేణి కాలనీలో గట్టి బందోబస్తు ఏర్పాటు …
Read More »పాడిరంగం అభివృద్ధిపై నివేదిక ఇవ్వండి
పాడిరంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెండోవిడత గొర్రెల పంపిణీలో వేగం పెంచాలని, డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ఆదేశించారు. యాంటీరేబిస్ వ్యాక్సిన్ కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సరఫరా చేయాలని చెప్పారు. గొర్రెలకు ఏడాదిలో మూడుసార్లు నట్టల …
Read More »విద్యుదుత్పత్తిలో తెలంగాణ టాప్
విద్యుదుత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో ఉద్యోగుల కోసం నిర్మించిన 430 క్వార్టర్ల సముదాయం, ఏసీహెచ్‌పీ కెమికల్ ల్యాబ్ బిల్డింగ్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీపీపీలోని పలు విభాగాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను సీఎండీ …
Read More »ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు మాస్క్, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ వారు చేపట్టిన యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యజమాన్యం ద్వారా యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ …
Read More »రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్
రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జడ్పీ చైర్మన్లు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »బీఎస్‌ఎన్‌ఎల్ పోయి.. రిలయన్స్ జియో వచ్చింది
బీజేపీపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక బీఎస్‌ఎన్‌ఎల్ పోయి.. రిలయన్స్ జియో వచ్చిందని హరీష్‌రావు అన్నారు. రేపు ఎల్‌ఐసీ పరిస్థితి అదే కాబోతుందన్నారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరగదని హరీష్‌రావు పేర్కొన్నారు. ఎంపీగా బండి సంజయ్ కనీసం 10 లక్షల పని చేశాడా అని హరీష్‌రావు ప్రశ్నించారు. ఎంపీగా …
Read More »