రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా రాష్ట్రపతికి భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తిని అందించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
Read More »నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం
మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, కౌన్సిల్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక మొత్తంలో పంట నష్టం, రైతుకు అపారమైన నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. …
Read More »సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 19 వేల ఎకరాలకు సాగునీళ్ళు
సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 19 వేల ఎకరాలకు, బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద ఒక లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగమేశ్వర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,653 కోట్లు, బసవేశ్వర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,774 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై సభ్యులు …
Read More »ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపుపై -మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు. …
Read More »‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో రుజువు చేసిన ఈటల రాజేందర్
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో మరెవ్వరికీ దక్కని ప్రాధాన్యం లభించింది. ప్రజలను ఆదరించి అభివృద్ధి చేయమని పదవులిస్తే.. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడు. తన ఆస్తులపెంపుకోసం ఆరాటపడి భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై …
Read More »ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నన్నపునేని..
పెరుకవాడకు చెందిన ఆటో డ్రైవర్ వల్లెపు మదుసూదన్ ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.. మదుసూదన్ బార్య లతకు,పిల్లలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో వారికి అందజేసారు.. వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో ఐక్యత ఆటోయూనియన్ బొల్లం సంజీవ్,నాగరాజు,మహేష్,రాజేందర్,కుమార్,నరేష్,రాకేశ్,శివ,కిషోర్,దేవరాజ్,నబి తదితరులు పాల్గొన్నారు..
Read More »తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత
తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. …
Read More »అమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ BJP-Minister పువ్వాడ
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మార్గదర్శనం చేస్తున్న టీఆర్‌ఎస్ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా ప్రతిపక్షాల పై మంత్రి అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు ఇప్పటికే 100కుపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని బేరానికి పెట్టిన బీజేపీ అమ్మకం పార్టీగా మిగిలిపోయిందని వంటగ్యాస్, …
Read More »హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ
అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్ ఐటీ, ఇన్‌ఫ్రా కంపెనీ పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్ హాల్స్, జిమ్, …
Read More »ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నది. పోలింగ్, ఫలితాల వెల్లడి రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. పోలింగ్‌కు ముందురోజు అంటే 29న కేంద్రాలను స్వాధీనం చేసుకుంటారు. 30న పోలింగ్, నవంబర్ 2న ఫలితాలు …
Read More »