ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్ ఉండగా, ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు. అధిక ధరలు విక్రయించిన ఒక్కో స్టాల్‌కు రూ.1,000 జరిమానాతో నోటీసులు …
Read More »రేవంత్ కు మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఉదయం జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. ఈటల కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు. కొంతకాలం తర్వాత ఈటలను …
Read More »సమస్యల పరిష్కారానికే శంకర్ నాయక్ ఉన్నాడు.
మహబూబాబాద్ నుండి గూడూరు పర్యటనకు వెళుతున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు మార్గ మధ్యలో జగన్ నాయకులగూడెం ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వాగతం పలకగా… ఎమ్మెల్యే వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో సమస్యలను ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యే శంకర్ నాయక్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం తో పాటు, మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని, …
Read More »మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సిఓలు, డిప్యూటీ సీఇఓలు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పలువురు జిల్లా పరిషత్ ల సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. తమకు పదోన్నతులు కల్పించినందులకు మంత్రికి వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా …
Read More »Huzurabad By Poll-బీజేపీకి షాక్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటి చేస్తున్న పార్టీ అయిన బీజేపీ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు తాము తోడుంటామంటూ యువత గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈక్రమంలో జమ్మికుంట పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు …
Read More »రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మనదే కీలక పాత్ర
గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక …
Read More »పది లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభ
వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభను అద్భుతంగా నిర్వహించుకుందాం. దీని కోసం ఎక్కడిక్కడ నాయకులు, కార్యకర్తలు కథానాయకులై పనిచేయాలి. 14 ఏండ్ల తెలంగాణ పోరాటం, ఏడేండ్లలో రాష్ట్రం సాధించిన ఘన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల ముందు ఉంచేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామసర్పంచ్ నేతృత్వంలో ప్రతీ గ్రామం నుంచి వాహనాలను సమకూర్చుకొని.. గ్రామ బ్యానర్‌తో విజయగర్జన సభకు తరలివచ్చేలా …
Read More »ముందస్తు ఎన్నికలకు వెళ్ళం:సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది.హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హుజరాబాద్‌లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. హుజురాబాద్‌లో విజయం మనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన …
Read More »టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నేటి నుండి నామినేషన్లు
టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఆయన ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేస్తారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ గ్రామ, మండల, పట్టణస్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక …
Read More »5వేల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తా-గెల్లు శ్రీనివాస్‌యాదవ్
ఈటల నిర్లక్ష్య ధోరణివల్ల నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని, తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఐదు వేల నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తానని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కమలాపూర్ మండలం దేశరాజ్‌పల్లెలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పేర్యాల రవీందర్‌రావుతో కలిసి శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »