పల్లెప్రగతి పనుల పురోగతి గ్రామస్థాయిలో పరిశీలించేందుకు మండల, జిల్లా స్థాయి అధికారుల తనిఖీకి ప్రత్యేకంగా ఇన్‌స్పెక్షన్ యాప్‌ను రూపొందించారు.తనిఖీల్లో మరింత పారదర్శకత కోసం ప్రతి గ్రామానికి ఆక్షాంశాలు, రేఖాంశాలను నమోదు చేశారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాల పరిధిలోకి వెళ్తేనే యాప్‌లో ఆ గ్రామం పేరు ఓపెన్ అవుతుంది. దీంతో ఆ గ్రామాలకు వెళ్లకున్నా వెళ్లినట్టుగా నివేదికలు ఇచ్చేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. ఇప్పటివరకు నాలుగు …
Read More »ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి-బీవీ రాఘవులు
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.ఎక్కువ ధాన్యం పండించే రాష్ర్టాలకు కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తున్నదని, దీనివల్ల తెలంగాణ ఇబ్బందుల పాలవుతున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు …
Read More »తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు
తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు పన్నుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. నల్లగొండ టౌన్ ఆర్జాల బావి ఐకేపీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రైతుల కోసం …
Read More »నేడే TRS ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటన
తెలంగాణ రాష్ట్రాధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More »సీఎం KCR మాటతో సిరిసిల్ల రైతు కొత్త బాట
వరి ధాన్యం కొనబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ఆదాయం వచ్చే పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలువురు రైతులు పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఆరుతడి …
Read More »మిషన్ కాకతీయ’ కు స్కొచ్ అవార్డ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అవార్డును దక్కించుకున్నది. తాజాగా మరో జాతీయ అవార్డును అందుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ-గవర్నెన్స్ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డ్‌కు ఎంపికయింది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్ …
Read More »పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి.
రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్పత్తికి రాజధానిగా మారడమే తెలంగాణకు పాపమైంది. దినదిన ప్రవర్థమానమై ఎదిగిపోతున్న తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.రాష్ట్రం నుంచి వరిధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పటంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నా, కేంద్రం ఉదాసీన వైఖరితో సాధ్యం కావడం లేదని బియ్యం …
Read More »డిసెంబరులోగా కొత్త మెడికల్ కాలేజీల భవనాలను పూర్తి చేయాలి
ఆరోగ్యశ్రీకి అదనంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద 646 వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ అదనంగా చేర్చిన వైద్యసేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా 946 రకాల వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. శనివారం బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణకు 12 అవార్డులు
స్వచ్ఛ భారత్ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ కృషి ఫలితమని మంత్రి అన్నారు. దేశంలోనే వినూత్నంగా కెసిఆర్ …
Read More »నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ICU వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు…తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి గారు …
Read More »