ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, …
Read More »MLC ఎన్నికలకు BJP దూరం.
తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈమేరకు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థులను నిలబెట్టినా పార్టీకి జిల్లాల్లో ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమమని బీజేపీ భావిస్తోంది. కాగా, మొత్తం 12 స్థానాల్లో డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.
Read More »మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ కు ఉత్తమ అవార్డ్
మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డ్ లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్ లో NFDB ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధక కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లు అవార్డ్ ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో …
Read More »దళిత వ్యతిరేక పార్టీ BJP
తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకుగాను సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేస్తామని కేసీఆర్ హెచ్చరించడంతోనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని చెప్పారు. భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో …
Read More »నేడే ఢిల్లీకి సీఎం కేసీఆర్
వరి ధాన్యం విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు దాటిపోయిందని, ఇక ఢిల్లీకి వెళ్లి స్పష్టత తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం తనతోపాటు వ్యవసాయశాఖ మంత్రి నాయకత్వంలో మంత్రుల బృందం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పా రు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకటిరెండు రోజులు అక్కడే ఉండి, వీలైతే ప్రధానిని కలిసి స్పష్టత తీసుకుంటానన్నారు. రైతులకు …
Read More »మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం నామినేషన్లకు గడువు ముగియనున్నది. ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల పరిధిలో ఓటు వేయనున్న …
Read More »చుక్కా రామయ్యకు మంత్రి ఎర్రబెల్లి సన్మానం
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం గూడూరుకు చెందిన చుక్కా రామయ్యను హైదరాబాద్ లోని విద్యానగర్ లో గల ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అలాగే ఆయనకు పాదాభివందనం చేసి, శాలువాతో సత్కరించారు. స్వీట్ బాక్స్ ని అందచేశారు.ఈ సందర్భంగా …
Read More »ఇది రైతుల విజయం: మంత్రి నిరంజన్ రెడ్డి
సాగు చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది రైతుల విజయమని చెప్పారు. దేశంలో వాస్తవ పరిస్థితిని మోదీ సర్కార్ ఇప్పటికైనా గుర్తించిందన్నారు. దేశ రైతాంగానికి, ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. ఆలస్యమైనా సముచితమైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వణికించే చలిలో కూడా ఉద్యమం చేసిన …
Read More »ఇది రైతు విజయం – మంత్రి KTR
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శక్తి కన్నా.. ప్రజాశక్తియే ఎప్పటికీ గొప్పదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రైతుల చట్టాలను వ్యతిరేకించడంలో తెలంగాణ సర్కార్ ముందున్న విషయం తెలిసిందే. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆందోళన కూడా చేపట్టింది. అయితే ట్విట్టర్ వేదిక …
Read More »సాఫ్ సీదా ముచ్చట.. వడ్లు కొంటరా..? కొనరా..?- మోదీకి కేసీఆర్ సూటి ప్రశ్న
రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట. సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణలో పండించే వడ్లు కొంటరా..? కొనరా..? అది చెప్పమంటే.. మేం మరాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ …
Read More »