కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు గారు కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయని, ఆ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్‌రావు శుక్రవారం …
Read More »తెలంగాణలో కొత్తగా 177కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,219 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు వైరస్ తో మరణించారు. మొత్తం 190 మంది కోలుకున్నారు.మొత్తం కేసుల సంఖ్య- 6,80,251 .మరణించిన వారి సంఖ్య – 4,018. ప్రస్తుతం యాక్టివ్ కేసులు – 4,470.మొత్తం ఒమిక్రాన్ కేసులు- 38
Read More »తెలంగాణకు మరో ఘనత
దేశంలో గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నెం.1 స్థానంలో నిలిచింది. ఆన్లైన్ ఆడిటింగ్ను 100శాతం పూర్తి చేసింది. 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై 25శాతం గ్రామాలు తాము చేసిన నిధుల ఖర్చులను ఆన్లైన్లో ఉంచాలని కేంద్రం ఇటీవల ఆదేశించగా.. గడువు కంటే ముందే తెలంగాణ 100% ఆడిటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత 72%తో తమిళనాడు, 60%తో ఏపీలో 2, 3 …
Read More »TSRTC మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »ఇక నుండి దళితబంధు ఎంపిక వాళ్ల చేతుల్లోనే
సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే లకు అప్పగించనుంది. తొలి ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షలు ఇవ్వనుండగా.. హుజురాబాద్ నియోజకవర్గం మినహా మిగతా చోట్ల ఈ పథకం త్వరలోనే అమలు చేయనుంది. …
Read More »క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించండి : TS హైకోర్టు
కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని …
Read More »వ్యవసాయమే మన నాగరికత-మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
భారతదేశం వేల సంవత్సరాలుగా వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు. వ్యవసాయం వృత్తిగానే కాదు వ్యవసాయమే జీవనాధారంగా వృద్ది చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది . ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుండే శ్రమ పుట్టింది. శ్రమ నుండి విలువలు పుట్టాయి. విలువల నుండి జీవితాలు నిలబడ్డాయి. తరతరాలకు అవి అనువంశికంగా వస్తున్నాయి. క్రమంగా ఈ రంగంలో ఉండే అవస్థలు , ఈ రంగం మీద పెట్టే దృష్టి ఎట్లయితే తగ్గుతూ వచ్చిందో …
Read More »మేడారం జాతరకు బస్సులు జాతర
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు తెలంగాణలో జరిగే మేడారం మహాజాతర కోసం టీఎస్ఆర్టీసీ 3845 బస్సులను నడపనుంది. సుమారుగా 21 లక్షల మంది భక్తులు జాతరకు వస్తారనే అంచనాలతో 2020లోనూ ఈ స్థాయిలోనే బస్సులు నడిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో 2250 బస్సులను ఈ రీజియన్ నుంచే నడపనుంది. జాతర సమయంలో మేడారం వద్ద బస్సులు నిలిపేందుకు …
Read More »తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు Good News
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,217 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లెక్చరర్ల సర్వీసులను రెన్యువల్ చేశారు. 2022, మే 31 వరకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, రెన్యువల్ అయిన వారిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. కాగా, సర్కారు నిర్ణయం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Read More »రాజన్న సిరిసిల్ల లో ఒమిక్రాన్ కలవరం
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ (మ) గూడెంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామంలో లాక్ డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే షాపులు, హోటళ్లు, బడులను మూసివేయగా.. రానున్న 10 రోజుల పాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పాలకవర్గం తెలిపింది.
Read More »