Home / Tag Archives: ktr (page 223)

Tag Archives: ktr

అందుబాటులోకి హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.ఎస్ఆర్డీపీ లో భాగంగా ఒవైసీ-మిథాని జంక్షన్లో రూ.80కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ఉ.10.30లకు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ కంచన్ బాగ్ ని పిసల్బండ్ డీఆర్డీఎల్ వైపు నుంచి ఒవైసీ ఆస్పత్రి జంక్షన్ మీదగా ఎల్బీ నగర్ వరకు వెళుతుంది. దీంతో ఎస్ఆర్డీపీలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వంతెనల సంఖ్య 13, అండర్పస్ …

Read More »

నేటి నుండి రైతుబంధు సాయం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి …

Read More »

తెలంగాణ రైతాంగానికి మంత్రి సింగరెడ్డి విన్నపం

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వలపుబాణాలు విసురుకొంటున్నాయని విమర్శించారు. విత్తనాలకోసం, ఇంటి అవసరాల కోసం మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే వారి వేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్కు భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు.

Read More »

త్వ‌ర‌లోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం-మంత్రి నిరంజ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ‌కు సంబంధించి త్వ‌ర‌లోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావ‌డం ఖాయ‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క‌లిసి ప‌ని చేస్తున్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీ అభ్య‌ర్థికి వేయించ‌లేదా? అని ప్ర‌శ్నించారు. ధాన్యం విష‌యంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిల‌దీస్త‌లేద‌ని మంత్రి అడిగారు. తెలంగాణ రాష్ట్రం …

Read More »

CM KCR గారి ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కృషి చేద్దాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని సూచించారు. తెలంగాణ ఆయుష్ ఫార్మాసిస్ట్ సెంట్రల్ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి హరీశ్ రావు సోమవారం కొకాపేట …

Read More »

తెలంగాణలో మరో 3ఒమిక్రాన్ కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4450 పెరిగింది. ఇప్పటివరకు 10 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని అధికారులు పేర్కొన్నారు.

Read More »

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నేడు ‘రచ్చబండ’ నిర్వహిస్తానని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

Read More »

త్వరలోనే తెలంగాణలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో వివిధ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే 60 వేల ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించగా.. అదనంగా మరో 40 వేల కొలువులు తేలనున్నట్లు సమాచారం. దీంతో 2022లో వరుస నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే శాఖలవారీగా సన్నాహాలు మొదలుపెట్టింది.

Read More »

తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కుమారుడిపై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైరయ్యారు. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. అటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Read More »

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం 133 కుటుంబాలకు రూ.7.95 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణశాఖ జీవో జారీ చేసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 27, యాదాద్రిలో 23, భూపాలపల్లిలో 12 కుటుంబాలకు పరిహారం రిలీజ్ చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat