తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30తో సెలవులు ముగియనుండగా తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబిత స్పష్టం చేశారు. సెలవులు పొడిగించాలా? విద్యాసంస్థలను తెరవాలా అనేది ఈ నెల 30 నాటి కరోనా పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. 8, ఆ పై తరగతులకు ఆన్ లైన్ క్లాసులు …
Read More »గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో గృహాలక్ష్మి సీరియల్ నటి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా గృహాలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు నటి కనకదుర్గమ్మ…. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని మంచి ఆహ్లాదకరమైన …
Read More »ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటికి జ్వర సర్వే ముమ్మరంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న జ్వర సర్వేలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య సిబ్బంది సూచనలు మేరకు ఔషధాలను వాడాలని మంత్రి పువ్వాడ ఉద్బోధించారు. కరోనా సోకినా వారు ఇంట్లోనే ఉంటూ హోమ్ ఐసోలేషన్ కిట్టులోని మందులను …
Read More »పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది- ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్ పట్టణం లోని పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు అన్నారు. నేడు ఖానాపూర్ పట్టణం లోని 11 వ వార్డులో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూం అర్జీదరుల నుండి అర్జిల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫరూఖి అలి గారితో కలిసి ప్రారంబించారు. తెలంగాణ ప్రభుత్వం …
Read More »GHMCలో కొత్తగా 1,421 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో గడిచిన గత 24 గంటల్లో 1,421 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,72,700 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.
Read More »త్వరలోనే జనగామ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయంలో భాగంగా జనగామ టీఆర్ఎస్ పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయని ఆయా కార్యాలయాలను సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపిస్తామని మంత్రి తెలిపారు. జనగామ …
Read More »కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సీఎం కేసీఆర్ …
Read More »విజయవంతంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్ళ సంఘం డైరీని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోకపేట్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, సెక్రెటరీ బలరాం యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాళ్ళ సంఘం అధ్యక్షులు కే ఎస్ రామారావు, జనరల్ సెక్రెటరీ కళింగ కృష్ణ కుమార్, అసోసియేట్ …
Read More »కొత్త జోన్లపై జాతీయపార్టీల సెల్ఫ్ గోల్ -ఎడిటోరియల్ కాలమ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందుకే తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసింది. 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమానికి కేంద్ర తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వనరులను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి సారించారు. రూ. లక్ష పై చిలుకు కోట్లతో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి …
Read More »సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుముల లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలన్నారు.
Read More »