తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read More »మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు …
Read More »కాళేశ్వరం ముక్తిమర్గం ..యాదాద్రి భక్తిమార్గం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముక్తి మార్గం, యాదాద్రి పునర్నిర్మాణంతో భక్తిమార్గాన్ని భావితరాలకు గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ రెండు గొప్ప పనులు చేశారని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి కొనియాడారు.ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం నూతన ఆలయాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సైతం యాదాద్రీశుడిని దర్శించుకొన్నారు. సీఎం కేసీఆర్.. అత్యంత పురాతనమైన యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప గౌరవాన్ని సంపాదించుకొన్నారని కొనియాడారు. ఈ …
Read More »రాజేంద్రనగర్ లో రూ.7వేల కోట్లతో ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం’
తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్రనగర్ లో రూ.7వేల కోట్లతో నిర్మించిన ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో కీలకమని చెప్పారు. వ్యవసాయాభివృద్ధి, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమన్నారు. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేంద్రంగా తెలంగాణ ల్యాబ్ గుర్తింపు పొందింది.
Read More »Apలో సీఎం కేసీఆర్ కు ఫ్లేక్సీలు
జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయన ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని పవన్ అభిమానులు విజయవాడలో ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలో పవన్ కల్యాణ్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఫోటోలను కూడా ప్రదర్శించారు. భీమ్లా నాయక్ సినిమా …
Read More »తెలంగాణ రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీ
తెలంగాణ రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీని వినియోగించుకొంటున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారని తాజాగా విడుదల చేసిన స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్‌స్ట్రాక్ట్-2022 వెల్లడించింది.ఆబ్‌స్ట్రాక్ట్ ప్రకారం.. 2020-21లో 1.07 లక్షల మంది ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరున్నర నెలల్లో 75 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకొన్నారు. రాష్ట్రంలో మొత్తం 77 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఉన్నారు. …
Read More »సిరిసిల్లలో రూ.60కోట్లతో టెక్స్‌పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ
తెలంగాణలో సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్‌పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్‌పోర్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్నది. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టెక్స్‌పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర డీ గోయెంకా ఒప్పంద పత్రాలు …
Read More »ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి-ఖర్చులను మేము భరిస్తాం -మంత్రి కేటీఆర్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, …
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్.. అందులో చర్చించాల్సిన అంశాలపై ఢిల్లీకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాల నిపుణులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
Read More »బీసీ గురుకులాలకు రూ.82.84 కోట్లు విడుదల
తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రభుత్వం రూ.82.84 కోట్లు విడుదల చేసింది. 2021-22 రెండవ త్రైమాసికానికి ఈ నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోనీ హైస్కూల్, జూనియర్ కాలేజీల నిర్వహణకు ఈ నిధులు వినియోగిస్తారు. 2021-22 బడ్జెట్‌లో సొసైటీకి ప్రభుత్వం రూ.165.68 కోట్లు కేటాయించిన విషయం …
Read More »