దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ …
Read More »వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు : మంత్రి ఎర్రబెల్లి
వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను అదేశించారు. శుక్రవారం వేసవిలో మంచి నీటి సమస్యల మీద ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సంబంధిత అధికారులు, సర్పంచులతో హైదరాబాద్ మిషన్ భగీరథ కార్యాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »“సహజ “బ్రాండ్ పేరుతో 100 రకాల నిత్యావసరాలను మార్కెట్లోకి విడుదల
మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేసేందుకు,వారి ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అందులో భాగంగానే తమ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, కార్పోరేషన్ నిత్యావసరాలను ఉత్పత్తి చేసి, మార్కెట్లోకి విడుదల చేసేందుకు “సహజ”బ్రాండ్ ను రూపొందించిందన్నారు.మంత్రి ఈశ్వర్ నియోజకవర్గం ధర్మపురికి చెందిన సుమారు 200మంది మహిళలు మేడ్చెల్ లోని మమతా, జీడిమెట్ల సుభాష్ నగర్ లో ఉన్న శ్రీయోగి, మణికంఠ …
Read More »“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం”
“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం” అన్నారు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ”ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని” పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని …
Read More »కేసీఆర్ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఉంటుందా?: కేటీఆర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్ లైన్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …
Read More »దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేటలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు
దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎస్‌టీపీ ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని మని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. చెత్తను మురుగునీటి …
Read More »మేం నామినేటెడ్ వ్యక్తులం కాదు: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిధికి లోబడి …
Read More »కొత్త సెక్రటేరియట్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలి
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు. మంగళవారం ముఖ్యమంత్రి నూతన సెక్రటేరియట్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును కూలంకశంగా, సూక్ష్మంగా పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం, పలు …
Read More »తెలంగాణ పట్ల ఆగని మోదీ వివక్ష: మంత్రి కేటీఆర్
నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభిచడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి …
Read More »ఓరుగల్లులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. …
Read More »