ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఎన్‌జీవో నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌లను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. వాటితో పాటుగా అంగన్‌వాడి టీచర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌లను కూడా మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి …
Read More »తెలంగాణలో స్టాఫ్ నర్సుల పోస్టులకు దరఖాస్తు దారులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరో ఛాన్స్ ఇచ్చింది. నేడు ఉదయం 10 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిటింగ్ కు ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
Read More »నిజామాబాద్ త్వరలోనే ఐటీ హబ్ ప్రారంభం
తెలంగాణలో కలలుగన్న ప్రగతి సాధ్యమవుతోందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ పనులను పరిశీలించిన ఆమె త్వరలోనే ఐటీ హబు ప్రారంభిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఐటీ హబ్ ఏర్పాటుతో 750 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు.
Read More »రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా గవర్నర్ వ్యవస్థ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బీజేపీ గవర్నర్లను రిమోట్ తో ఆపరేట్ చేస్తూ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతోంది. న్యూట్రల్ గా ఉండాల్సిన గవర్నర్.. చేయాల్సిన పనులు చేయకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. బిల్లులను నొక్కిపెట్టడానికి వారికి హక్కు లేదు. దేశంలో గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా …
Read More »బీజేపీ టార్గెట్ సీఎం కేసీఆర్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆధారాలుంటే తనను అరెస్టు చేయించాలని బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో అనే విషయం వారికే తెలియదు. బీజేపీ అసలు టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే ముందుగా మా …
Read More »రేవంత్ పాదయాత్రలో అపశృతి
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్లోని కార్లు వరుసగా వెళ్తున్నరు. ఈ క్రమంలో ఓవర్స్పీడ్ తో పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. పలువులు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Read More »ఈనెల 12న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల పన్నెండో తారీఖున కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 12న సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం 11వ తేదీన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చి, ఓ అధికారిక కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. సంగారెడ్డి కార్యక్రమంలో సుమారుగా 2 వేల …
Read More »ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో 260(61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అంతర్గత నియామకాలతో వీటిని భర్తీ చేస్తారు. అర్హులైన ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నేటి నుంచి ఈ నెల 13వ తేదీలోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు జీఎం పర్సనల్, సింగరేణి హెడ్ ఆఫీస్, …
Read More »తెలంగాణలో బీజేపీని ఓడించి తీరుతాం -ఓవైసీ
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీని తామే ఓడిస్తామని ఏఎంఐఎం అధినేత..హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. బీజేపీ విస్తరించాలని ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. తాము కర్ణాటక, రాజస్థాన్లో పోటీ చేస్తామని …
Read More »మోదీ సర్కారుపై మంత్రి తలసాని ఆగ్రహాం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ వచ్చిన తర్వాత గత ఎనిమిదేండ్లలో రూ.745 గ్యాస్ ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతాయన్నారు. పెంచిన ద్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో …
Read More »