తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో సుమారు 24 మంది దుర‍్మరణం చెందారు. తిరుపూర్ జిల్లా అవినాషి వద్ద KSRTC కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీ కొనడటంతో 19మంది సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 30మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుప్పుర్, కోయంబత్తూరు ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. …
Read More »కండక్టర్ వేషాలు..నడిరోడ్డు మీదే చెంప చెల్లుమనిపించిన యువతి !
బెంగళూరులో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.21ఏళ్ల యువతి కేఎస్ఆర్టీసీలో బెంగలూరు నుండి హసన్ వెళ్తున్న సమయంలో కండక్టర్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే ఆమె తెలివిగా ధైర్యసాహసాలతో తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి బెల్లూర్ క్రాస్ వద్ద మిడ్ వేలో దిగే ముందు ఆ కండక్టర్ ను చెంప చెల్లుమనిపించింది. ఈ ఘటన శనివారం జరిగింది. అతన్ని అలనే వదిలేయకుడదని తన తల్లితండ్రులు, ఫ్రెండ్స్ సహాయంతో పోలీసులకు …
Read More »కర్ణాటకలో ఆర్టీసీ ప్రైవేటు పరం..?
కర్ణాటక రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. దీంతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది. ఈ అంశం గురించి ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఒక్క ఆర్టీసీనే కాకుండా దీంతో పాటు మరో ఇరవై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టాల బాటలో ఉన్నాయి. వీటిని కూడా వదిలించుకునేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్నట్లు …
Read More »హైదరాబాద్ బయలుదేరిన బస్సులో ..!
బెంగళూరు నుంచి బుధవారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీ బస్సు ‘ఐరావతం’ మంటల్లో చిక్కుకుంది. ప్రమాదాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు బయలుదేరిన గంటలోగానే నగర శివార్లలోని దేవనహళ్లి వద్ద ఇంజిన్‌లో మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఆ సమయంలో సిబ్బందితోపాటు బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. వారంతా వేగంగా వాహనం దిగడంతో ముప్పుతప్పింది. అగ్నిమాపక దళాలు …
Read More »