దివంగత ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కే లక్ష్మణ్‌లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అనంతరం ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ
ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన భౌతికకాయం స్వస్థలానికి చేరుకోవడంతో కృష్ణం రాజును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణం రాజు మృత దేహాన్ని చూసిన ఆయన సతీమణి శ్యామలా దేవి కన్నీరుమున్నీరయ్యారు. సినీ ప్రముఖులు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, మహేశ్‌బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజు సుందరం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నాని, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు భౌతికకాయానికి …
Read More »ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు ఇకలేరు..
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఇవాళ(ఆదివారం) వేకువజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. రేపు ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో …
Read More »