మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.
Read More »