వరద బాధితులను పరామర్శించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. పుచ్చకాయలపేటలో వరదబాధితులను పరామర్శించారు. ఈ క్రమంలోఅక్కడ ఉన్న నక్కా విజయలక్ష్మి 8 నెలల కుమారుడిని సీఎం ఎత్తుకున్నారు. ఈ సమయంలో సీఎం జేబులో ఉన్న పెన్‌ను బాలుడు తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త కింద పడింది. వెంటనే అధికారులు ఆ పెన్‌ను తిరిగి …
Read More »అప్పుడు నేనొస్తే అందరూ నా చుట్టే తిరిగేవారు.. : జగన్
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అరిగెలవారిపేటలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు. వరదల సమయంలోనే తాను వచ్చి ఉంటే అధికారులంతా తన చుట్టే తిరిగేవారని.. అందుకే వారికి కొంత సమయం ఇచ్చి ఇప్పుడొచ్చానని చెప్పారు. అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలంటే …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార …
Read More »రైతులకు మేలు చేసేందుకు దేశంతో పోటీ: జగన్
కోనసీమలో క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా? ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చినందుకా? ఎందుకు క్రాప్ హాలిడే అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా పథకం కింద రూ.2,977కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేసే …
Read More »అమలాపురం ఘటనల వెనుక టీడీపీ, జనసేన: మంత్రి విశ్వరూప్
అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరని ఏపీ మంత్రి విశ్వరూప్ అన్నారు. కోనసీమలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వారెవరూ రోడ్లపైకి రావొద్దని.. రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని కోరారు. అమలాపురంలో ఆందోళనకారులు తగులబెట్టని తన ఇంటిని మంత్రి పరిశీలించారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఆందోళలో కొంతమంది రౌడీషీటర్లు చేరారని విశ్వరూప్ ఆరోపించారు. అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారన్నారు. …
Read More »చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారు: మంత్రి రోజా
వైసీపీ పాలనపై బురద చల్లేందుకే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అమలాపురం ఘటనల్లో తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతిలో రోజా మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఆందోళనలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో వాళ్లని బయటకు తీస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని.. ప్యాకేజీ తీసుకుని …
Read More »వెనకుండి రెచ్చగొట్టడం కాదు.. మీడియా ముందుకు రండి: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్
పచ్చని కోనసీమలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అశాంతిని రేకెత్తించాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కోనసీమకు డా బీఆర్ అంబేడ్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేడ్కర్ జిల్లా పేరు పెడతామని చెప్పారని సుభాష్‌చంద్రబోస్ గుర్తుచేశారు. బయట ఒకలా..లోపల మరోలా చెప్పొద్దని.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలన్నారు. వెనుకనే ఉండి రెచ్చగొట్టడం సరికాదని ఆగ్రహం …
Read More »అంబేడ్కర్ పేరుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి: సజ్జల
జిల్లాల విభజన సందర్భంలో కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వచ్చాయని.. దానికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విస్తృతంగా డిమాండ్ ఉండటంతోనే అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మహానేత అంబేడ్కర్ పేరు పెడితే అందరూ ఓన్ చేసుకోవాలని సజ్జల అన్నారు. ప్రస్తుత పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ.. గతంలో మాత్రం అన్ని …
Read More »అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు!
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘కోనసీమ’ జిల్లా పేరును మార్చవద్దంటూ అక్కడి యువకులు ఒక్కసారిగా భారీ ఆందోళనకు దిగారు. అమలాపురం పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్దకు చేరుకుని ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకోగా వారు తప్పించుకుని పరుగులెత్తారు. వారిని పోలీసులు వెంబడించడం.. ఈ క్రమంలో …
Read More »చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి పరుగెత్తాడు: జగన్ ఎద్దేవా
ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి లేదని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడన్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం మంగళగిరిలో ఓడిపోయిన సొంతపుత్రుడు.. రెండు చోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడిని నమ్ముకుని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా మురమళ్లలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన …
Read More »