తెలంగాణలోని త్వరలోనే ఉపాధ్యాయులు మంచి శుభవార్త వినబోతారని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకే కాస్త ఆలస్యం జరుగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,460 పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే.. ఇందులో 20,899 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన సంగతి కూడా మనకు తెల్సిందే ..ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి …
Read More »మునుగోడు ఉప ఎన్నిక – బీజేపీకి షాక్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బిజెపి కి చుక్కెదురైంది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ను కాదని బిజెపి లో చేరిన చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటికే కాంగ్రెస్,బిజెపి ల నుండి గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్న నేపద్యంలో తాజాగా జరిగిన దోనిపాముల పరిణామం బిజెపి కి మింగుడు పడకుండా చేసింది.ఈ …
Read More »ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మట్టి, గోమయంతో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కూడా రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఈ క్రమంలో సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. రాష్ట్రంలోని మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ …
Read More »ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంపల్లి నుండి దూలపల్లి వెళ్లే రోడ్డు అభివృద్ధి, నాలా నిర్మాణం, ప్రధానంగా మంచినీటి కనెక్షన్లు, పారిశుధ్య నిర్వహణ, వీధి ద్వీపాల వంటి సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. …
Read More »మునుగోడులో టీఆర్‌ఎస్‌దే విజయం – టీఆర్‌ఎస్ ఎల్పీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారినుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈడీ, సీబీఐని చూసి భయపడొద్దన్నారు. కేంద్ర …
Read More »సీఎం కేసీఆర్ గారితో సీపీఎం నేతలు భేటీ..?
తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, అందుకు ప్రయత్నించే దుష్టశక్తులను ఐక్యంగా తిప్పికొడదామని ప్రజాస్వామిక లౌకికవాద శక్తులకు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ది జీవులను మేధావులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈమేరకు శనివారం నాడు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభధ్రం, ఆపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే …
Read More »జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటన
జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామంలో సిడిపి,DMFT నిదులు 6.30లక్షల తో నిర్మించిన మున్నూరు కాపు వెల్ఫేర్ సొసైటీ నలువాల వాడ మున్నూరు కాపు సంఘ కమ్యూనిటీ హాల్ ను ప్రారంబించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు. అనంతరం.మున్నూరు కాపు సంఘం అధ్వర్యంలో వినాయకుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే,జెడ్పీ చైర్ …
Read More »కొంపల్లిలో మిషన్ భగీరథ నల్లాను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శాంతినికేతన్ లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి నల్లాను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే …
Read More »