కరోనా బారిన పడి కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది. తాజాగా ఈ మూవీకి సైన్ చేసిన ఈ అమ్మడు.. తన డేట్స్ కూడా కేటాయించిందట. ప్రస్తుతం ఆచార్య మూవీతో కొరటాల శివ బిజీగా ఉండగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్తో మూవీని …
Read More »రాశీ ఖన్నా సంచలన నిర్ణయం
కరోనా కష్టకాలంలో హీరోయిన్ రాశీఖన్నా తనకు సాధ్యమైనంత వరకూ అనాథల ఆకలి తీరుస్తోంది. ముంబైలో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న వారికి ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సాయం చేస్తోందట. అయితే ఎలాంటి ప్రచారం లేకుండానే ఆమె.. సైలెంట్గా అన్నార్థులను ఆదుకుంటోందట.
Read More »కంగనా రనౌత్ కి కరోనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.
Read More »గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యువరత్ననందమూరి బాలకృష్ణ.. ఇటీవల విడుదలైన ఘన విజయం సాధించిన ‘క్రాక్’ గోపీచంద్ మలినేనితో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. క్రాక్, వకీల్ సాబ్ చిత్రాల సక్సెస్తో జోష్ మీదున్న అందాల భామ శృతిహాసన్.. బాలయ్యతో జోడీ కట్టనుందట. ఇప్పటికే సలార్ లాంటి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉంది శృతి. బాలయ్య మూవీకి …
Read More »కరోనాతో ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) మృతి
టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగాం. స్వరమాధురి సంస్థ స్థాపించి 6,500కు పైగా కచేరీలు చేశారు. ‘ఒక వేణువు వినిపించెను’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వంటి పాటలను పాడారు. ‘పండంటి కాపురం’, ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లోనూ తన గాత్రంతో అలరించారు.
Read More »ఆ వ్యాపారంలోని నమిత ఎంట్రీ
టాలీవుడ్ లోకి సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నమిత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. తాజాగా నమిత థియేటర్ పేరుతో OTT వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘కొత్త నటీనటులు, దర్శకులతో పాటు ప్రతిభను చూపించే వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మా OTT ద్వారా చిన్న సినిమా నిర్మాతలకు సంబంధించి చిత్రాలను విడుదల చేయడానికి సాయం చేస్తాం’ అని నమిత తెలిపింది.
Read More »‘మండేలా’ రీమేక్ లో సునీల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, కమెడియన్ సునీల్.. తమిళ సినిమా తెలుగు రీమేక్లో నటించనున్నాడని తెలుస్తోంది. గత నెలలో తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన ‘మండేలా’ సినిమా నెటి ప్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ అనిల్ సుంకర.. AK ఎంటర్టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. ముందు బండ్ల గణేశ్ అనుకున్నా.. ఇప్పుడు ‘మండేలా’ …
Read More »ఆ మెగా హీరోపై మనసు పారేసుకున్న బుజ్జమ్మ
ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత కృతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉప్పెన షూటింగ్కి ముందు దర్శకుడు తనను కొన్ని సినిమాలు చూడమని కోరాడట. అన్నింటిలో కృతికి ‘రంగస్థలం’ బాగా నచ్చిందట. ఆ సినిమా చూశాక రామ్ చరణ్ అభిమానినైపోయానని చెప్పుకొచ్చింది. ఆయనతో ఓ సినిమా చేయాలనేది తన కోరిక అంటోంది కృతి.
Read More »తొలిసారిగా చైతూ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య.. తొలిసారి వెబ్ సిరీస్లో ముందుకు రానున్నాడు. చైతూ లీడ్ రోల్లో అమెజాన్ ప్రైమ్ సరికొత్త సిరీస్ రూపొందిస్తోంది. నాగచైతన్య.. తన OTT ఎంట్రీ యాక్షన్ థ్రిల్లర్తో చేయనున్నాడు. విక్రమ్ కె కుమార్.. ఈ సిరీసు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. జులైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతూతో పాటు రాధిక ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి పాన్ ఇండియా యాక్టర్స్ …
Read More »విజయ్ దేవరకొండ సరసన కత్రినా కైఫ్
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సరసన నటించనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లైగర్ పూర్తైన తర్వాత తన సినిమా ప్రకటించాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహర్ భావించాడట. అయితే, ఈ సినిమా గురించి సమాచారం ముందుగానే బయటకి వచ్చేసింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే కత్రినాతో విజయ్ రొమాన్స్ చేయడం ఖాయమంటున్నాయి బీటౌన్ వర్గాలు.
Read More »