గతంలో లీకైన తన న్యూడ్ వీడియో గురించి హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించింది. ఆ వీడియో తనది కాదని ఎవరో కావాలని సృష్టించారని గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. ఆ వీడియో వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయాను. 4 రోజులు బయట అడుగుపెట్టలేకపోయానని తెలిపింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
Read More »కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్‌బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు …
Read More »టైం గ్యాపంతే…టైమింగ్ లో కాదంటున్న రీతూ
పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకొన్నది హీరోయిన్ రీతూవర్మ. మొదటి మిస్ హైదరాబాద్ పోటీలో రన్నరప్‌గా నిలిచిన ఈ భామ అందంతో, అభినయంతో టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ మంచిపేరు సంపాదించుకుంది. ఇప్పుడు ‘టక్ జగదీష్’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రీతూ తత్త్వమే అంత. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాల సంఖ్య లెక్కేసుకోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటుంది. కాబట్టే, సమ్‌థింగ్ స్పెషల్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపును సాధించుకొన్నది. …
Read More »రేణు దేశాయ్ కు కోపం వచ్చింది..ఎందుకంటే..?
సినీ నటి రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. కొవిడ్-19 చికిత్స కోసం సాయం కోరుతూ తాము పంపే సందేశాలకు సరైన సమయంలో స్పందించడం లేదని కొందరు వ్యక్తులు మెస్సేజ్‌లు రేణూదేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న రేణూ దేశాయ్.. కొన్నిరోజులుగా కొవిడ్ బాధితులకు చేయూతనందిస్తున్నారు. కొవిడ్ దావాఖానల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణూకి తాజాగా ఓ నెటిజన్ మెస్సేజ్ చేశాడు. అయితే, దానికి ఆమె …
Read More »ఊపు మీదున్న లావణ్య త్రిపాఠి
ఈ ఏడాది ‘ఏ వన్ ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రం అంగీకరించారు. రవీంద్ర మాధవన్ దర్శకత్వంలో అథర్వ మురళీ కథానాయకుడుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐఏఎస్‌కు ప్రిపేరవుతున్న యువతిగా లావణ్య కనిపించనున్నారు. ఓ ముఠా చేతిలో కిడ్నాప్‌కు గురయిన కథానాయికను కాపాడే పోలీస్ అధికారిగా అథర్వ కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని …
Read More »నెటిజన్లకు నయనతార సలహాలు
స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ తాజాగా కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యారు. దానిపై నయనతార నెటిజన్లకు వివరణ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో నయనతార, విఘ్నేశ్ శివన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నర్సు నయనతారకు కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే నర్సు చేతిలో ఉన్న సిరంజి కనిపించకుండా ఆ ఫొటోలను ఎడిట్ చేసి …
Read More »రామ్ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘విజయవాడలో లారీ డ్రైవర్‌గా ప్రారంభమైన మీ జీవితం మాకెన్నో పాఠాలను నేర్పించింది. కుటుంబ సభ్యుల కోసం చాలా కష్టపడ్డారు. మన దగ్గర …
Read More »దానికి నో చెప్పిన అందాల రాక్షసి
తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …
Read More »మరోసారి ఆ హీరోతో సాయిపల్లవి రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై విజయవంతమైన ‘ఛలో, భీష్మ’ వంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలని సాయి పల్లవిని చిత్రయూనిట్ సంప్రదిస్తోందట. ‘ఫిదా’తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి వెండితెరపై మెరవనుందా? లేదా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Read More »కరోనా బాధితులకు అండగా రకుల్ ప్రీత్ సింగ్
తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Read More »