గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అడ్డుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ల నిర్మాణాన్నిఅడ్డుకోవడం దారుణమని విమర్శించారు. గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. …
Read More »లైవ్‌లో లోకేష్‌ను బిత్తరపోయేలా చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
టీడీపీ నేత లోకేష్‌కు వైసీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో లోకేష్ బిత్తరపోయారు. వాళ్లను చూడగానే వెంటనే జూమ్ లైవ్‌ను కట్ చేసేశారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దొంగ ఐడీలతో …
Read More »అలా చేస్తే విద్యార్థులు లోకేశ్, పవన్‌లా తయారవుతారు: కొడాలి నాని
టెన్త్ విద్యార్థులకు లేనిపోనివి చెప్పి వాళ్ల ఆత్మహత్యలకు టీడీపీ నేత నారా లోకేష్ ప్రేరేపిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అలాంటి పనులు చేయొద్దని చెప్పేందుకే లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. అమరావతిలో మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. తాను డైరెక్ట్‌గా తన జూమ్ ఐడీతో వెళితే లోకేష్ మాట్లాడరని.. అందుకే తన మేనల్లుడి లింక్‌తో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు. టెన్త్ …
Read More »పవన్‌కు ఆ ప్రొసీజర్ కూడా తెలీదు: కొడాలి నాని ఎద్దేవా
డా.బీఆర్.అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను ఈ దేశం నుంచి బహిష్కరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చదువుతున్నారని విమర్శించారు. చిన్నపిల్లలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ అని.. అది కూడా పవన్‌కు …
Read More »మళ్లీ మా 151 సీట్లు మాకే: కొడాలి నాని
జగన్ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని …
Read More »ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సర్వే చేయించారు: కొడాలి నాని
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని.. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్‌తో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌కోఆర్డినేటర్ల సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని జగన్ ఆదేశించారన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాలను తిరిగి సమస్యలను అక్కడి బుక్‌లో రాయాలని.. వాటిని తాను పరిష్కరిస్తానని …
Read More »మాజీ మంత్రి కొడాలి నానికి కీలక పదవి?
ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కొడాలి నానికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఛైర్మన్ పదవికి కేబినెట్ హోదా కల్పించాలనేది జగన్ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మరో …
Read More »కొత్త కేబినెట్‌లో పాతవాళ్లు ఎంతమంది? కొడాలి నాని ఏమన్నారంటే?
ఇటు కేబినెట్‌లో అటు పార్టీలో కొందరు సమర్థులు కావాలని.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ ప్రారంభంలోనే చెప్పారన్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్‌కు తమ రాజీనామాలను సమర్పించామని చెప్పారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు. పార్టీలో …
Read More »ఏపీ కేబినెట్.. 24 మంది మంత్రుల రాజీనామా
ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం …
Read More »మంత్రి కొడాలి నానికి కరోనా
ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
Read More »