టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.
Read More »