తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కల్లూరు మండలం పోచారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మధిరలో సీపీఎం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ విధానాలు నాయకుల తీరు నచ్చక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
Read More »ఖమ్మంలో ఐటీ టవర్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్‌లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల …
Read More »24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
హైదరాబాద్ లోని మియాపూర్ డివిజన్ లో జయప్రకాష్ నగర్ కాలనీ నందు 108 డివిజన్ టీ.ఆర్.ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ గారి గెలుపును ఆకాంక్షింస్తూ అన్వర్ షరీఫ్ గారి అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందన్నారు . తెలంగాణ రాష్ట్రం …
Read More »“ది అరవింద్ షో” రూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలో టిఆర్ యస్ పార్టీ నగర అధ్యడు కమర్తపు మురళి కి చెందిన అరవింద్ బ్రాండెడ్ షోరూం ఇల్లెందు క్రాస్ రోడ్డు కరెంట్ ఆఫీస్ ఏదురగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడూతూ జిల్లా వాసులకి నాణ్యమైన దుస్తులు అందించే అరవింద్ షోరూం స్థాపించిన మురళికి శుభాకాంక్షులు తెలిపారు.నూతన వస్తాల కోనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
తెలంగాణలో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రూ.1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. నిరుపేదలకు అవసరమైన నివాసానికి అవసరమైన ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి …
Read More »అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగడలపై మంత్రులు నేతలతో సమీక్ష చేశారు. అభ్యర్థి ఎవరైనా, గెలుపు ఖాయంగా పని చేయాలని నిర్ణయించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రులిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతి నగర్ కళాశాల, రఘునాధపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల …
Read More »కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగలు-మంత్రి పువ్వాడ
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా వారి ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విత్తన గణపతిని పంపిణీ చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఈ సందర్భంగా గురువారం vdo’s క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు …
Read More »పీవీ శతజయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
భారత మాజీ ప్రధాని గౌరవ శ్రీ పి.వి. నరసింహారావు గారి శతజయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి పిలుపు మేరకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు సత్తుపల్లి లో శ్రీ పి.వి నరసింహారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ – సత్తుపల్లిలో నెలకొల్పబడుతున్న స్మృతి వనానికి …
Read More »ఖమ్మం జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలికకు కరోనా..! ఎలా వచ్చిందంటే..?
తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఖమ్మంలో కరోనా ప్రభావం లేదు. అంతా సేఫ్ అని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భావిస్తున్న సమయంలో కలవరం మొదలైంది. శనివారం వరకు నాలుగు పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆదివారం ఓ ఎనిమిదేళ్ల బాలికకు లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ఖిల్లాకు చెందిన ఆ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికి కరోనా రాగా.. అదే కుటుంబానికి చెందిన బాలికకు లక్షణాలు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. …
Read More »